రాజా డీలక్స్ మూవీపై వస్తున్న ఆ వార్తలు అవాస్తవమేనా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో నిర్మాతలు క్యూ కడుతూ భారీ సినిమాలను ప్రకటించారు.

 Prabhas Raja Deluxe With Director Maruthi , Director Maruthi, Prabhas, Raja Delu-TeluguStop.com

బాహుబలి( Bahubali ) తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోక పోయిన కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.

ఇక మరో రెండు వారాల్లో ఆదిపురుష్( Adipurush ) సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు వస్తున్నాడు.

మరి ఇది అయిన ఆకట్టు కుంటుందో లేదో చూడాలి.ఇదిలా ఉండగా ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా కూడా ఉంది.ఈ సినిమా ప్రభాస్ మిగిలిన ప్రోజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అయిన కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

యాక్షన్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేస్తున్నట్టు టాక్.‘రాజా డీలక్స్’( Raja Deluxe ) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ కూడా రాలేదు.కానీ ఈ సినిమా షూట్ మాత్రం పూర్తి అవుతుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది.ఈ సినిమాను మారుతి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అనే వార్తలు కొద్దీ రోజులుగా వైరల్ అవుతుండగా అందులో ఎలాంటి నిజం లేదని ఇది ఒక పార్ట్ మాత్రమే అని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube