రాజా డీలక్స్ మూవీపై వస్తున్న ఆ వార్తలు అవాస్తవమేనా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.

ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో నిర్మాతలు క్యూ కడుతూ భారీ సినిమాలను ప్రకటించారు.

బాహుబలి( Bahubali ) తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోక పోయిన కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.

ఇక మరో రెండు వారాల్లో ఆదిపురుష్( Adipurush ) సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు వస్తున్నాడు.

మరి ఇది అయిన ఆకట్టు కుంటుందో లేదో చూడాలి.ఇదిలా ఉండగా ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా కూడా ఉంది.

ఈ సినిమా ప్రభాస్ మిగిలిన ప్రోజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

అయిన కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. """/" / యాక్షన్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేస్తున్నట్టు టాక్.

'రాజా డీలక్స్'( Raja Deluxe ) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ కూడా రాలేదు.

కానీ ఈ సినిమా షూట్ మాత్రం పూర్తి అవుతుంది. """/" / ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది.

ఈ సినిమాను మారుతి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అనే వార్తలు కొద్దీ రోజులుగా వైరల్ అవుతుండగా అందులో ఎలాంటి నిజం లేదని ఇది ఒక పార్ట్ మాత్రమే అని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.