యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.అయ్యో వెయ్యి కోట్ల సినిమా కనీసం రూ.500 కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఇతర సినిమా ల యొక్క మార్కెట్ ఎలా ఉంటుందో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతోంది.
ఆదిపురుష్ సినిమా ఫెయిల్యూర్ క్రెడిట్ దర్శకుడు ఓమ్ రౌత్( Om rout )కి వెళ్లి పోయింది.ప్రభాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో కూడా ప్రభాస్ కి పెద్దగా నెగిటివిటీ రాలేదు.అందుకే ప్రభాస్ యొక్క తదుపరి సినిమా లకు ఎలాంటి డ్యామేజీ లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా కు దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ ఉంది.ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో తమిళ నాట ఈ సినిమా స్థాయిని అయిదు రెట్లు పెంచినట్లుగా కమల్ గెస్ట్ అప్పియరెన్స్ వార్త లు వస్తున్నాయి.
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్( kamal hassan ) ఏకంగా పది హేను నిమిషాల పాటు సినిమా లో కనిపిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అదే జరిగితే సినిమా కు తమిళ నాట భారీ క్రేజ్ దక్కుతుంది అంటూ అంతా భావిస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ప్రాజెక్ట్ కే సినిమా యొక్క బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ అన్నట్లుగా ఉంది.కనుక తమిళనాట మినిమం గా వసూళ్లు వస్తేనే అంతటా బ్రేక్ ఈవెన్ సాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కమల్ వల్ల కేవలం తమిళనాట మాత్రమే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా కూడా ప్రాజెక్ట్ కే యొక్క స్థాయి పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.







