యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) కు కెరీర్ లో ఎన్ని ప్లాప్స్ వచ్చిన ఈయన నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ కు హిట్ అనేదే పడలేదు.
భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులతో వచ్చిన ప్రభాస్ స్టామినాతో కొద్దిమేర కలెక్షన్స్ వచ్చాయి కానీ సినిమాలు మాత్రం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇక ఆదిపురుష్ వంటి భారీ ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న మరో సినిమా ”సలార్’‘ ( Salaar ).ఈ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.
క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ట్రైలర్ తర్వాత ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ మరింత ఎగ్జైటింగ్ గా మారారు.
అయితే తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమా నుండి రెండవ ట్రైలర్ ( Salaar Trailer ) ను రిలీజ్ చేయనున్నట్టు టాక్.ఈ సెకండ్ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేయనున్నారు అని కన్ఫర్మ్ అయ్యింది.
దీంతో ఇప్పుడు అందరి కళ్ళు ఈ ట్రైలర్ మీదనే ఉన్నాయి.

ఈ ట్రైలర్ భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉంటుందని టాక్ రావడంతో దీని కోసం ఫ్యాన్స్ మరింతగా ఎదురు చూస్తున్నారు.చూడాలి ఎలా ఆకట్టుకుంటుందో.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.
హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.







