యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం లో సినిమా అంటూ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.సినిమా పై పెరుగుతున్న అంచనాలను దృష్టి లో పెట్టుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా ను రూపొందిస్తూ వచ్చాడు.
కేజీఎఫ్ ని మించిన సినిమా అంటూ దర్శకుడు ప్రశాంత్ గతం లోనే ప్రకటించాడు.నిజంగానే అలాగే ఉండబోతుందని రెండు ట్రైలర్స్ ను చూస్తే అర్థం అవుతోంది.

సినిమా మరి కొన్ని గంటల్లో విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో ఫలితం పై అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు.అయితే ఏమాత్రం నెగటివ్ ఫీలింగ్ లేకుండా అభిమానులు వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం అన్నట్లుగా నమ్మకంతో ఉండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) ఈ సినిమా లో ఉండటం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.జగపతి బాబు, శ్రియా రెడ్డి ఇంకా ఎంతో మంది పాన్ ఇండియా స్టార్స్ ఈ సినిమా లో నటించారు.

శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూసి ఉండరు అన్నట్లుగా ఉండబోతున్నాయి అంటూ ట్రైలర్ చూసిన అభిమానులు మరియు మీడియా సర్కిల్స్ వారు అంటున్నారు.బాబోయ్ ఈ రచ్చ ఏంట్రా బాబు అన్నట్లుగా సినిమా కు టాక్ వచ్చింది.నిన్న అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయిన సమయం లో థియేటర్ల వద్ద సందడి ఏ రేంజ్ లో ఉందో చూశాం.చాలా సంవత్సరాల తర్వాత టికెట్ల కోసం థియేటర్ల వద్ద తొక్కిసలాట అనే వార్తలు చూశాం.
అది కేవలం సలార్ కి మాత్రమే సాధ్యం అయిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జోరు చూస్తూ ఉంటే వెయ్యి కోట్లు కాదు 1500 కోట్ల రూపాయలు సాధ్యం ఖాయం అనిపిస్తోంది.