ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు.సీటు విషయంలో సీఎం జగన్ ను కలవలేదని చెప్పారు.
అలాగే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో జగన్ నిర్ణయిస్తారని తెలిపారు.
సీఎం జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో సీఎం జగన్ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారన్నారు.రాష్ట్రంలో జగన్ పాలన వచ్చిన తరువాతే బడుగు, బలహీన వర్గాలకు సరైన న్యాయం జరిగిందని తెలిపారు.
అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే కాకుండా వారిని అన్ని రకాలుగా అదుకున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.







