తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్( Prabhas ) ఈయన చేస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ప్రస్తుతం సలార్ సినిమా( Salaar ) 600 కోట్ల కలక్షన్స్ ని ఐదు రోజుల్లోనే రాబట్టి తమదైన రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇదిలా ఉంటే ఆయన తర్వాత సందీప్ వంగ,( Sandeep Vanga ) నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో చేసే సినిమాలకు సంబదించిన న్యూస్ అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ని రేకెత్తిస్తుంది.
ఎందుకంటే ఈ సినిమాలు కూడా పాన్ ఇండియాలో దుమ్ము దులిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక వీటితోపాటుగా హను రాఘవ పూడి( Hanu Raghavapudi ) డైరెక్షన్ లో కూడా మరో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.అయితే దీనికి సంబంధించిన ఆఫీషయల్ అనౌన్స్ మెంట్ అయితే ఇంకా రాలేదు కానీ తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన క్లారిటీ ఇవ్వబోతున్నారు గా వార్తలు అయితే వస్తున్నాయి.ఇక వీటితోపాటుగా ప్రభాస్ మరికొన్ని ప్రాజెక్టులను కూడా ఒప్పుకుంటునట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్లు కూడా ప్రభాస్ కి కథలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు ప్రభాస్ అయితే కొత్త సినిమాలను ఒప్పుకునే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది…

ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత తను కొత్త సినిమాలు మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే హను రాఘవ పూడి సినిమా ఉంటుందా లేదా అనే విషయం పైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు.ఈ సినిమా కమిట్ అయితే మాత్రం ఈ సినిమా దాదాపు ఇంకో రెండు సంవత్సరాల తర్వాత ఉండొచ్చని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే మధ్యలో కల్కి,( Kalki ) స్పిరిట్( Spirit ) సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఆ సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి…
.