రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఆదిపురుష్, సలార్ సినిమాల మీద పెట్టాడు.అయితే మారుతి డైరక్షన్ లో 100 రోజుల్లో రాజా డీలక్స్ సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేశారు.
మే మొదటి వారం లో సలార్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్న ప్రభాస్ ఆ మూవీ షెడ్యూల్ అవగానే మారుతి సినిమా ప్లాన్ చేస్తున్నారట.కేవలం 3 షెడ్యూల్ లతోనే మారుతి సినిమా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట.
అంతేకాదు అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ప్రభాస్, మారుతి కాంబో మూవీని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అంత త్వరగా సినిమా పూర్తి చేస్తారా అని డౌట్ రావొచ్చు.
మారుతి తన సినిమాలన్ని చాలా తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తాడు.మరి ప్రభాస్ తో కూడా అదే విధంగా సినిమా పూర్తి చేస్తాడా లేదా అన్నది చూడాలి.
నిజంగానే మారుతి మూవీ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి అంతకుమించిన పండుగ మరొకటి ఉండదని చెప్పొచ్చు.ఈ సినిమాపై ప్రభాస్ కూడా అంతే ఫోకస్ గా ఉన్నాడని తెలుస్తుంది.







