టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్లు ఈ మధ్య కాలంలో అంచనాలకు మించి పెరిగాయి.ప్రభాస్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రం 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్న ఈ హీరోలు తమ సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
హీరో ప్రభాస్ సినిమాల ద్వారా తనకు వచ్చిన రెమ్యునరేషన్ ను వేర్వేరు రంగాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
రియల్ ఎస్టేట్ లో కొంత మొత్తాన్ని థియేటర్లలో మరి కొంత మొత్తాన్ని ప్రభాస్ పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం.యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లలో తెరకెక్కే సినిమాలలో కూడా హీరో ప్రభాస్ పెట్టుబడులు ఉన్నాయని సమాచారం అందుతోంది.
మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తంతో ప్రైమ్ ఏరియాలలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు.

మిగతా డబ్బును జనసేన పార్టీ కోసం ఖర్చు చేయడంతో పాటు కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడం కోసం పవన్ ఆ డబ్బును ఉపయోగిస్తున్నారు.మరో స్టార్ హీరో మహేష్ బాబు సినిమాల ద్వారా, రెమ్యునరేషన్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే.

సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని తన బ్యానర్ ద్వారా సినిమాలు నిర్మిస్తూ మహేష్ ఖర్చు చేస్తున్నారు.థియేటర్ల బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో కూడా మహేష్ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు.ఇతర హీరోలు కూడా తమ సంపాదనను వేర్వేరు రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ తమ సంపాదనను రెట్టింపు చేసుకుంటున్నారు.
ఈ టాలీవుడ్ స్టార్ హీరోల భవిష్యత్తు ప్రాజెక్టులపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.







