ప్రభాస్ కోసం అలాంటి కథను సిద్ధం చేశా.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్!

దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో ఆయన తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

 Prabhas In Lcu Or Not, Prabhas In Lcu Or Not, Prabhas, Lcu, Tollywood, Lokesh Ka-TeluguStop.com

ఇది ఇలా ఉంటే లోకేష్ కనగరాజ్ ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​లో LCU భాగమా కాదా అన్న అనుమానాలు వచ్చాయి.

అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ లోకేశ్​ కనగరాజ్​.పూర్తి వివరాళ్లోకి వెళితే.

Telugu Prabhas, Tollywood-Movie

లోకేశ్​ కనగరాజ్​ తన చిత్రాలను కనెక్ట్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​ను సృష్టించారు.ఖైదీ, విక్రమ్ చిత్రాలకు లింక్ పెట్టారు.ఇక ఇప్పుడు లియో కూడా ఎల్‍సీయూలో భాగమేనని ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.కాగా ఈ మూవీ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్​లోనే ప్రభాస్ సినిమా గురించి ఆ మధ్య అనౌన్స్​ చేశారు.

తాజాగా మరో ప్రమోషన్స్​లో ప్రభాస్​ సినిమా ఎల్​సీయూలో భాగామా కాదా అనే విషయమై క్లారిటీ ఇచ్చారు లోకేశ్.ప్రభాస్‍తో తాను చేసే సినిమా ఎల్‍సీయూలో భాగం కానే కాదని తేల్చి చెప్పేశారు.

Telugu Prabhas, Tollywood-Movie

ఈ చిత్రం స్టాండ అలోన్​గా ప్రత్యేకంగా ఉంటుందని ఆయన తెలిపారు.తన గత సినిమాలకు, ప్రభాస్‍తో చేసే చిత్రానికి సంబంధం ఉండదని అన్నారు.ప్రభాస్​ కోసం ఒక ఒరిజినల్ స్టోరీని సిద్ధం చేస్తానని లోకేశ్ చెప్పారు.దీంతో ప్రభాస్ లోకేశ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.​అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు మరో రెండేళ్ల సమయమైనా పట్టే అవకాశం ఉంది.ఎందుకంటే ప్రస్తుతానికి వీరిద్దరి చేతిలో చాలా ప్రాజెక్ట్​ ఉన్నాయి.

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.కాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube