డార్లింగ్ చేతిలో మూడు పాన్ వరల్డ్ మూవీస్.. వీటితో ప్రభాస్ రేంజ్ మారనుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) స్టార్ డమ్ గురించి అందరికి తెలిసిందే.ఈయన టాలీవుడ్ లో ప్రెజెంట్ ఉన్న స్టార్ట్ హీరోల్లో మొట్టమొదటిగా పాన్ ఇండియా వ్యాప్తంగా పాగా వేసాడు.

 Prabhas Has The Most Impressive Lineups Of Films, Prabhas, Adipurush, Project K,-TeluguStop.com

బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుని అలాగే మార్కెట్ కూడా పెంచుకున్నాడు.ఇక ఇప్పుడు ప్రభాస్ పాన్ వరల్డ్ వైడ్ గా మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు.

ఇదిలా ఉండగా ప్రభాస్ ఇప్పుడు మొత్తంగా మూడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు అని టాక్.ముందుగా ”ప్రాజెక్ట్ కే” (Project K) సినిమాను పాన్ వరల్డ్ అని ప్రకటించారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు.

అయితే ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు అని అంటున్నారు.ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్, సలార్ కూడా ఉన్నాయి.ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే అనౌన్స్ కాగా ఇప్పుడు మాత్రం పాన్ వరల్డ్ కు సిద్ధం అవుతున్నాయి అని తెలుస్తుంది.

వీటిలో సలార్ (Salaar) సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ (Adipurush) తెరకెక్కుతుంది.ఈ మూడు సినిమాలతో రెబల్ స్టార్ తప్పకుండ పాన్ వరల్డ్ దగ్గర తన స్టామినా చూపించడం ఖాయం అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube