Prabhas : పదేళ్లు గా ఆ ఒక్కటి కావాలంటున్న ప్రభాస్ ఫ్యాన్స్ కోసం తిరిగిచ్చేస్తారా ?

మామూలుగా ప్రభాస్( Prabhas ) ఏది బాకీ ఉంచుకోరు.ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు.

 Prabhas Dance After 10 Years-TeluguStop.com

అదేంటి ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఎవరికి ఏమి ఇవ్వాల్సి ఉంటుంది ? ఆయన ఎవరి దగ్గరైనా అప్పు చేశారా అని అనుమానం మీలో రావచ్చు.పదేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నారు.

అది ఇప్పుడు తిరిగి ఇచ్చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యాడట.ఇంతకీ ప్రభాస్ 10 ఏళ్లు గా అభిమానులను ఎందుకు వెయిట్ చేయిస్తున్నాడు ? అందుకు గల కారణం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Anushka, Dance, Kalki, Maruthi, Mirchi, Prabhas, Raja Saab, Tollywood-Mov

2013లో మిర్చి సినిమా( Mirchi )తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.ఈ సినిమాలో డాన్సులు ఇరగదీశారు.ఆ తర్వాత బాహుబలి సినిమా రావడం ఆయనలోని మాస్ డాన్స్ స్టెప్పులు ఆగిపోవడం జరిగిపోయాయి.అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆయనలోని మాస్, యాక్షన్, క్రేజ్ వాడుకుంటున్న దర్శకులు ఆయనలోని మాస్ నెంబర్ ని మాత్రమే చూపించ లేకపోతున్నారు.

ఆయన నుంచి ఒక మాస్ స్టెప్ రావాలని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.ఆ కల నెరవేరే సమయం రానే వచ్చింది.ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా సాబ్ చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు.అయితే కల్కి సినిమాలో నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక మాస్ స్టెప్ చేయించబోతున్నారట.

మంచి డాన్స్ పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న చిన్న ఎలిమెంట్ ఉందనే విషయం తాజాగా బయటకు వచ్చింది.

Telugu Anushka, Dance, Kalki, Maruthi, Mirchi, Prabhas, Raja Saab, Tollywood-Mov

అంతే కాదు మారుతీ డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా మంచి మాస్ నెంబర్ ఉంది అనే విషయం తెలుస్తుంది.చాలా రోజులుగా మాస్ ఆడియన్స్ ని ప్రభాస్ మర్చిపోయాడు.ఈ సినిమాతో ఆ చిన్న లోటు కూడా పూర్తవుతుంది అనే తెలుస్తుంది.

ఈ రెండు సినిమాల ద్వారా ఆయన డాన్స్ మరోసారి ప్రేక్షకులు చూసే అవకాశం వస్తుంది.బాహుబలి రెండు భాగాల్లోనూ, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్, సాలార్ చిత్రాలలో ఆయనకు డాన్స్ చేసే అవకాశాలు రాలేదు.

ఆ చిత్రాల దర్శకులకు కూడా కావలసింది డాన్స్ కాదు.కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు.ఇప్పుడు ఆయన మాస్ సినిమా తీస్తున్నారు కాబట్టి మరో మారు అందరూ ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube