బాలీవుడ్ లో ఖాన్ లకి మించిపోయిన ప్రభాస్ క్రేజ్

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానులని ఆకట్టుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మరో సారి సాహో సినిమాతో దేశ వ్యాప్తంగా తన సత్తా చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి దేశ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు.

ఈ సినిమాలో మేకింగ్ విజువల్స్, ప్రభాస్ స్టైల్, లుక్స్ అయితే అతని ఫాన్స్ కి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాని హాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ తో పోల్చేస్తున్నారు.

సాహో సినిమాని ఇండియన్ మిషన్ ఇంపాజిబుల్ గా అభివర్ణిస్తున్నారు.హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ రూపొందించిన యాక్షన్ ఎపోసోడ్స్ ఇప్పటి వరకు ఇండియన్ యాక్షన్ సీరిస్ అయిన ధూమ్ సీరిస్ లో కూడా రాలేదని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ మీద ద్రుష్టి పెట్టి ముందుగా బాలీవుడ్ లో మొదలుపెట్టాడు.బాలీవుడ్ లో లో సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ప్రభాస్ ని అక్కడ యాంకర్ ఆకాశానికి ఎత్తేశాడు.

Advertisement

సాహో సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ముంబైలో ఈ సినిమా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, బాలీవుడ లో మీకు డై హార్ట్ ఫాన్స్ ఉన్నారని చెప్పాడు.ప్రస్తుతం బాలీవుడ్ లో మీ క్రేజ్ బాలీవుడ్ ఖాన్స్ నే తలదన్నేలా ఉందని కామెంట్ చేశాడు.

అయితే ఈ కామెంట్స్ పై ప్రభాస్ స్మైల్ ఇచ్చి వారి రేంజ్ తనకు లేదని సింపుల్ గా చెప్పాడు.ఇదిలా ఉంటే సాహో హిందీ ట్రైలర్ చూసిన తర్వాత అక్కడి ఆడియన్స్ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

సాహో సినిమా విజువల్స్ అద్బుతంగా ఉన్నాయని, బాలీవుడ్ లో ఇకపై హృతిక్ రోషన్, ప్రభాస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ఆసక్తికర కామెంట్స్ చేసారు.మరి ఈ నెల ఆఖరున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు