యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా తో ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వం లో చేస్తున్న కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వచ్చే ఏడాది లోనే మారుతి( Maruthi ) దర్శకత్వం లో చేస్తున్న సినిమా ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్రభాస్ ప్లాన్ చేశాడు అంటున్నారు.ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన అధికారికంగా ప్రకటన రాలేదు.
కానీ సినిమా షూటింగ్ విషయం లో మాత్రం క్లారిటీ వచ్చేది ఎప్పుడు అనేది తెలియడం లేదు.ప్రభాస్ సన్నిహితులు ఇతర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తారు అంటున్నారు.
ఆ మధ్య విదేశాల్లో ఉండి లాంగ్ బ్రేక్ ను ప్రభాస్ తీసుకున్నాడు.ఎట్టకేలకు ఆ మధ్య తిరిగి రావడంతో వెంటనే మారుతి ఒక షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నాడు.అంతే కాకుండా ప్రభాస్ తన కల్కి సినిమా( Kalki 2898 AD ) కోసం కూడా డేట్లు కేటాయించాడు.
మారుతి దర్శకత్వం( Maruthi ) లో రూపొందుతున్న సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయింది అంటున్నారు.అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.అన్ని వర్గాల వారిని ప్రభాస్ తన సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
మారుతి తన సినిమా తో ప్రభాస్ అభిమానులతో పాటు, థ్రిల్లర్ సినిమా లను ఇష్టపడే వారిని సర్ ప్రైజ్ చేస్తాడు అంటున్నారు.ఈ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు ఫ్యాన్స్ ని కూడా ప్రభాస్ సలార్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.వెయ్యి కోట్ల వసూళ్లు ప్రభాస్ కి మరోసారి సాధ్యం అంటున్నారు.ఈ సమయంలో మారుతి సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో కూడా కనిపిస్తుంది.మారుతి సినిమా తర్వాత స్పిరిట్ సినిమా ను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో ప్రభాస్ చేయబోతున్నాడు.