యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ సినిమా లో నటిస్తున్నాడు అనేది చాలా మంది అభిమానులకు కన్ఫ్యూజన్ గా ఉంది.ఎందుకంటే ఆయన మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.
వాటిల్లో మూడు సినిమా లు షూటింగ్ దశలో ఉన్నాయి.అందులో ఏ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అనే విషయం లో క్లారిటీ అస్సలు ఉండడం లేదు.
అందుకే ప్రభాస్ ఏ సమయం లో ఏ సినిమా ను చేస్తున్నాడో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాం అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో ప్రభాస్ యొక్క ప్రస్తుత సినిమా గురించి అప్డేట్ కావాలంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

హైదరాబాద్ శివారు ప్రాంతం లో వేసిన ఒక భారీ సెట్టింగ్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ షెడ్యూల్ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది.ఎట్టకేలకు చిత్రీకరణ ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతుంది.
ఈ నెల చివరి వరకు మారుతి దర్శకత్వం లో పొందుతున్న సినిమా యొక్క చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతుంది.

వచ్చే నెలలో ప్రాజెక్ట్ కే చిత్రీకరణలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో కూడా ప్రభాస్ సలార్ సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ కూడా సమాంతరంగా జరుగుతోంది.
ఒకే సారి మూడు సినిమాల చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొన్నారు.మరో వైపు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.







