టీడీపీ నేత, ఐటీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.సోషల్ మీడియాలో పోస్టుల కేసులో విజయ్ ను విచారించనున్నారు అధికారులు.
ఈ మేరకు జనవరి 30వ తేదీన సీఐడీ అధికారుల ముందు విజయ్ హాజరైన సంగతి తెలిసిందే.ఇవాళ మరోసారి విజయ్ ను సీఐడీ విచారించనుంది.
అయితే సీఎం జగన్ భార్య వైఎస్ భారతి లక్ష్యంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు గత ఏడాది సెప్టెంబరులో వైరల్ అయింది.ఐటీడీపీ ద్వారా సర్క్యులేట్ చేశారంటూ సీఐడీ అధికారులు… ఐపీసీ 419, 469, 153ఏ, 505(2), 120-బి, రెడ్ విత్ 34, 66(సి)తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 2000 కింద గత ఏడాది అక్టోబరులో కేసు నమోదైంది.







