ప్రభాస్ రెండు ఫామ్ హౌస్ లు ఎన్ని కోట్ల విలువ చేస్తాయో తెలుసా ?

బాహుబలి సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.నిజానికి ఎంతో మొహమాటస్తుడైన ప్రభాస్ సాధారణంగా బయటపడడు.

 Prabhas And His Farm Houses Details Prabhas , Farm Houses, Tollywood, Salar , A-TeluguStop.com

చాల లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతుంటాడు.అందుకే అభిమానులకు మరింత క్యూరియాసిటీ పెరిగి, అతని గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు.

ప్రభాస్ పెట్టుకునే వాచ్ దగ్గర్నుంచి ధరించే బట్టలు, వాడే కార్, ఉండే ఇల్లు ఇలా అన్నీ కూడా అభిమానులకు ఎంతో ప్రత్యేకం.

అయితే ప్రభాస్ సినిమా సినిమాకి కాస్త గ్యాప్ తీసుకుంటూ ఉంటాడు.

అంతేకాదు ప్రైవసీకి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు.సమయం దొరికిందంటే చాలు ఇంట్లో ఒంటరిగా ఉండడానికి లేదంటే ఫామ్ హౌస్ కి వెళ్లడానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు.

అయితే ప్రభాస్ దగ్గర రెండు ఫార్మ్ హౌజ్ లు ఉన్నాయి.సిటీ ఔట్స్కట్స్ లో స్టార్ హీరోస్ అంతా పెట్టుబడులు పెట్టినట్టుగానే ప్రభాస్ సైతం ఒక ఫామ్ ని కొనుక్కున్నాడు.

దాని ధర ప్రస్తుతం 60 కోట్లుగా ఉందట.కొన్ని బాలీవుడ్ మీడియాల కథనాల ప్రకారం ప్రభాస్ ఫామ్ హౌస్ లో ఒక బంగ్లా తో పాటు అన్ని రకాల కూరగాయలు అలాగే కొన్ని తోటలు కూడా ఉన్నాయట.

ఇటీవల హరితహారం పథకం లో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు ప్రభాస్ మొక్కలు నాటింది కూడా ఈ ఫామ్ హౌస్ లోనే కావడం విశేషం.ఈ ఫామ్ హౌస్ లో ఒక స్విమ్మింగ్ పూల్, జిమ్ అందమైన బంగ్లా అలాగే అతడు ఎప్పుడైనా పార్టీలు పెట్టుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయట.

Telugu Adhipurush, Bhimavaram, Farm Houses, Prabhas, Prabhas Farm, Salar, Tollyw

ఇక మరొక ఫార్మ్ హౌస్ గురించి వివరాల్లోకెళ్తే, ఇది ప్రభాస్ పుట్టిన ఊరైన భీమవరంలో ఉంది.ఈ ఫార్మ హౌజ్ దాదాపుగా 84 ఎకరాల్లో విస్తరించి ఉండటం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక్కడ అనేక రకాల పళ్ళ తోటలు, కూరగాయ తోటలు అలాగే దాదాపుగా కొంత భాగం అటవీ ప్రాంతంగా ఉందట.కొన్నేళ్ల క్రితం కోటి 80 లక్షలకు ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్టుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube