యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు.ఈయన బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే.
దీంతో ఈయన క్షణం తీరిక లేకుండా షూటింగులతో బిజీగా ఉన్నాడు.వరుసగా నాలుగు సినిమాల షూటింగులను ఒకేసారి పూర్తి చేస్తూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.
మరి డార్లింగ్ ఇంత బిజీగా ఉండి కూడా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న షోకు గెస్ట్ గా విచ్చేశాడు.బాలయ్య హోస్ట్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షో ప్రెజెంట్ సూపర్ ఫాస్ట్ గా దూసుకు పోతుంది అనే చెప్పాలి.
సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 2 కూడా స్టార్ట్ చేసారు.
ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ పర్వాలేదు అనిపించినా బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రం నిలవలేదు.
అయితే ఈసారి ఎపిసోడ్ ను అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేసి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ను గెస్ట్ గా తీసుకు వచ్చారు.మరి గత కొన్ని రోజులుగా ప్రోమోలతో ఊరిస్తున్న ఆహా వారు నిన్న ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తెచ్చేసారు.
ఎప్పుడు శుక్రవారం వచ్చే ఈ ఎపిసోడ్ ఈసారి ఒకరోజు ముందుగానే గత రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అయ్యింది.రెండు భాగాలుగా ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ మొదటి భాగాన్ని నిన్న స్ట్రీమింగ్ చేసారు.ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తనకు ఇష్టమైన ఇద్దరు దర్శకుల గురించి చెప్పుకొచ్చాడు.దివంగత డైరెక్టర్ బాపు, అలాగే మణిరత్నం అని చెప్పారు.వీరి సినిమాలను అస్సలు మిస్ కాకుండా చూస్తాను అంటూ తెలిపారు.అలాగే మణిరత్నం గారితో వర్క్ చేయడానికి భవిష్యత్తులో ఎప్పుడు సిద్ధమే అంటూ చెప్పిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.