టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్( Prabhas ) ఒకరు కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన అనంతరం నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.ఇకపోతే ప్రభాస్ బాహుబలి సినిమాలో నటించి తన నటనతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయినటువంటి ఈయనకు అప్పటినుంచి సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.
ఇక త్వరలోనే ప్రభాస్ నటించిన సలార్ (Salaar) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దీంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలకు చిత్ర బృందం హాజరవుతూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ప్రభాస్ కి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ అంటేనే అందరికీ టక్కున అనుష్క ( Anushka ) పేరు కూడా గుర్తుకు వస్తుంది.ఇలా వీరిద్దరూ పలు సినిమాలలో కలిసిన నటించారు.ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి నటన ఎంతో అద్భుతంగా ఉండటంతో వీరికి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.ఇలా ప్రభాస్ అనుష్క జోడికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ రావడమే కాకుండా వీరిద్దరూ నిజ జీవితంలో ఒక్కటైతే ఎంతో బాగుంటుందని చాలామంది భావించారు కానీ వీరిద్దరి మధ్య ప్రేమ లేదని కేవలం వీరిద్దరూ మంచి స్నేహితులు అని మాత్రమే తెలియజేశారు.
ఇకపోతే ప్రభాస్ పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తున్నప్పటికీ ఈయన మాత్రం ఎప్పుడు పెళ్లి గురించి స్పందించలేదు కానీ ఇటీవల ఆది పురుష్ సినిమా వేడుకల్లో మాత్రం తాను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తిరుపతిలోనే తన పెళ్లి జరుగుతుంది అంటూ తెలియజేశారు కానీ ఎప్పుడు చేసుకుంటారు అనే విషయం మాత్రం తెలియలేదు.ఇకపోతే నిజజీవితంలో ఒక్కటి కాలేకపోయినటువంటి వీరిద్దరూ కూడా వ్యాపార రంగంలో మాత్రం ఒకటి కావాలని నిర్ణయం తీసుకున్నారట.ఈ క్రమంలోనే హైదరాబాదులో ఓ పెద్ద షాపింగ్ మాల్ ( Shoping mall ) ఏర్పాటు చేయాలని అనుష్క ప్రభాస్ ఆలోచన చేసినట్టు తెలుస్తుంది.విదేశాలలో ఉన్న విధంగా హైదరాబాదులో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని ప్రభాస్ భావించారట దీంతో అనుష్క కూడా తాను ఈ వ్యాపారంలో భాగస్వామ్యం అవుతానని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారట.
ఇక ఈ షాపింగ్ మాల్ కి ఎప్పటికీ వీరిద్దరూ కలిసి ఉండేలాగే ఇద్దరి పేర్లను కలిపి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.మరి అనుష్క ప్రభాస్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.