రెండు వారాల ముందే వచ్చేసిన ఆదిపురుష్ రివ్యూ...

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) పాన్ ఇండియా సినిమా మారినప్ప‌టి నుంచి ఆయ‌న న‌టిస్తున్న సినిమాల‌పై అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి.ఇక తాజాగా ఆయ‌న హిరోగా న‌టించిన చిత్రం ఆదిపురుష్’( Adipurush ) వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతున్నది .

 Prabhas Adipurush Movie First Review Details, Adi Purush, Prabhas Adipurush Movi-TeluguStop.com

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా అతి త్వరలోనే పాల్గొన బోతున్నాడు ప్రభాస్, జూన్ 6 వ తేదీన‌ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చెయ్యబోతున్నారు.ఇప్పటికీ ఈ చిత్రం నుండి విడుదలైన జై శ్రీ రామ్ అనే పాట సెన్సేషన్ సృష్టించింది.

సోషల్ మీడియా లో కానీ , బయట కానీ ఎక్కడ చూసిన ఈ పాటనే వినపడుతుంది.

 Prabhas Adipurush Movie First Review Details, Adi Purush, Prabhas Adipurush Movi-TeluguStop.com
Telugu Adi Purush, Adipurush, Om Raut, Kriti Sanon, Prabhas, Saif Ali Khan-Movie

దానికి తోడు రీసెంట్ గానే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ కి ( Adipurush Graphics )ప్రశంసల వర్షం కురిసింది.టీజర్ అప్పుడు గ్రాఫిక్స్ విషయం ఏ రేంజ్ విమర్శలు వచ్చాయో, ట్రైలర్ కి ఆ రేంజ్ ప్రశంసలు వచ్చాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ సిద్ధం అయిపోయిందట, రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో దర్శక నిర్మాతలు దిల్ రాజు తో కలిసి ఫైనల్ ఔట్పుట్ చూసారు.వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

అనుకున్న దానికంటే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, రామాయణం పై ఇది వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.

Telugu Adi Purush, Adipurush, Om Raut, Kriti Sanon, Prabhas, Saif Ali Khan-Movie

కానీ ఇందులో రామాయణం ని గ్రాండ్ స్కేల్ లో సరికొత్త టెక్నాలజీ తో చూపించారని, కచ్చితంగా ఆడియన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందని దిల్ రాజు చెప్పాడట.ఇక ఈ సినిమా 3D వెర్షన్( Adipurush 3D ) కూడా అన్నీ బాషలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.3D వెర్షన్ చూసే ఆడియన్స్ కి మనం రామాయణం ప్రపంచం లోకి ఆడుగుపెట్టామా.అనే అనుభూతి కలుగుతుందట, వెండితెర మీద శ్రీరాముని వైభోగం ని ఎలా అయితే చూడాలని రామ భక్తులు కోరుకున్నారో, అంతకు మించి ఉందట ఈ సినిమా, ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కేవలం బాలీవుడ్ నుండే వెయ్యి కోట్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు .మొత్తంగా రెండు వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube