ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగుతున్న పేరు ఆదిపురుష్( Adipurush ).ఈ సినిమా విడుదల కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే థియేటర్ల వద్ద భారీ కటౌట్లను ఏర్పాటు చేసుకుంటూ అప్పుడే సందడిని మొదలు పెట్టేశారు.సినిమా విడుదల రోజున థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపిస్తుంది అనడంలో ఎటువంటి సహాయం లేదు.
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న థియేటర్ల వద్ద వాతావరణం ఇలాగే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే విడుదల తేదీకి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.
అప్పుడే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సుల్లో వేలసంఖ్యలో అడ్వాన్స్ అమ్మకాలు జరుగుతున్నాయి.పీవీవిఆర్ 18500, ఐనాక్స్ 12500, సినీపోలీస్ 8000 టికెట్లు అమ్మేశాయి.
టికెట్ రేట్ల పెంపు వ్యవహారం తేలగానే ఏపీ తెలంగాణలో ఒక్కసారి అమ్మకాలు ఊపందుకుంటాయి.కేవలం బాలీవుడ్ వరకే లెక్కలు చూసుకున్నా ట్రెండ్ చూస్తే ఆర్ఆర్ఆర్ దాటే సూచనలు ఉన్నాయి.
అయితే ఈ రేంజ్ లో స్పందన ప్రభాస్ కు దక్కుతుందా లేకపోతే రాముడి దా అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం ఠక్కున చెప్పడం కష్టమే.

ఎందుకంటే అయోధ్య రామాలయం( Ayodhya Ram Temple ) నిర్మాణంలో ఉన్న సమయంలో జనంలో శ్రీరాముడి సెంటిమెంట్ బలంగా ఉంది.పైగా రామాయణం శతాబ్దాలుగా పవిత్ర గాథగా నీరాజనాలు అందుకుంటూనే ఉంది.పైగా ఇది హీరో పేరు మీదే నడిచే యాక్షన్ మూవీ లాంటిది కూడా కాదు.
సీతారాముల గుడి లేని ఊరు దాదాపుగా ఉండదంటే అతిశయోక్తి కాదు.ఒంటిమిట్ట, భద్రాచలం( Ottimitta, Bhadrachalam ) మనవైపున్న అద్భుత ఆలయాలు.
అలాంటి కథను గ్రాండియర్ గా చెప్పడం భక్తుల్లోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపిందిఅలా అని ప్రభాస్ ఇమేజ్ ని తక్కువ తూచడానికి కూడా లేదు.దానికి నార్త్ లో సాహోకు వచ్చిన స్పందనే ప్రత్యక్ష సాక్ష్యం.

ఒకవేళ టాలీవుడ్ లో డిజాస్టర్ అయిన బాలీవుడ్( Bollywood ) లో కమర్షియల్ గా సేఫ్ అయ్యింది ఒకవైపు రాముడి ఎమోషన్, మరోపక్క ప్రభాస్ ఎలివేషన్ రెండూ జత కూడటంతో అంచనాలు భారీగా పెరిగాయి.దీనికి ప్రమోషన్ క్యాంపైన్ కొంత దోహదం చేస్తున్న మాట వాస్తవం రెండు చేతులో కలిస్తేనే చప్పట్లు కొట్టినట్టు ఇక్కడ రాముడు ప్లస్ ప్రభాస్ కాంబినేషన్ ఇంత స్పందనకు దోహదపడింది.ఇంకో కోణంలో చెప్పాలంటే ఇదే ఆదిపురుష్ ని అజయ్ దేవగనో లేదా కార్తీక్ ఆర్యనో లాంటి హీరో చేసి ఉంటే ఈ స్థాయి ఫిగర్లు కనిపించేవి కాదన్నది ఒప్పుకోవాలి.ఒకవేళ 16న పాజిటివ్ టాక్ వస్తే ముందుగా ట్రెండ్ ఊపందుకునేది ఉత్తరాది రాష్ట్రాల్లోనే.
అయిదు రూపాయల నాణేనికి ఏ వైపు ఎక్కువ విలువ ఉంటుందంటే ఎవరైనా ఏం చెప్తారు.ఇదీ అంతే.







