ఆదిపురుష్ నుండి మరో అప్డేట్.. హనుమాన్ జయంతి సందర్భంగా బ్యూటిఫుల్ పోస్టర్!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కథానాయికగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”ఆదిపురుష్”(Adipurush). ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.

 Prabhas Adipurush Hanuman Jayanti Update Details, Adipurush, Hanuman Jayanti, A-TeluguStop.com

దీంతో ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు పెరిగాయి.అయితే ఆదిపురుష్ నుండి మేకర్స్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ చేసారో అప్పటి నుండి ఈ సినిమాపై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

అసలు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజువల్ గ్రాఫిక్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటే చిన్న టీజర్ తో మొత్తం నిరుత్సాహ పరిచారు.మరి నెటిజెన్స్ నుండి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో టీమ్ ఆలోచనలో పడింది.

అందుకే జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా జూన్ 16న వాయిదా వేశారు.

Telugu Adipurush, Hanuman Jayanti, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan,

ఇక వాయిదా వేసి కూడా నాలుగు నెలలకు పైగానే అవుతున్న ఇంకా ఫ్యాన్స్ కు నచ్చే విధంగా సినిమా ప్రమోషన్స్ ఇవ్వలేక పోతున్నారు.ఈ మధ్యనే శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు.ఇక ఈ రోజు ఈ సినిమా నుండి మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ రోజు హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా బ్యూటిఫుల్ పోస్టర్ ను (Adipurush Update) రిలీజ్ చేసారు.

Telugu Adipurush, Hanuman Jayanti, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan,

ఈ పోస్టర్ లో హనుమాన్ రాముడిని జపిస్తూ ధ్యానం చేస్తున్న పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్ లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు.మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్న సాలిడ్ అప్డేట్ ఈ రోజు అందించారు మేకర్స్.ఇప్పటి నుండైనా ఫ్యాన్స్ మెచ్చే అప్డేట్ లను రిలీజ్ చేస్తే సినిమా రిలీజ్ సమయానికి భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కించగా టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) సీతగా నటించింది.

అలాగే సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube