ప్రభాస్( Prabhas ) నటించిన ఆదిపురుష్( Adipurush ) మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సమ్మర్ అంతా చప్పగా సాగిన ఇండియన్ బాక్సాఫీస్ పై ప్రభాస్ తన ముద్ర వేయాలని చూస్తున్నాడు.
ఆదిపురుష్ బిజినెస్ ఎంత ఫైనల్ టార్గెట్ ఎంత అన్నది పక్కన పెడితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మొదటి రోజు టార్గెట్ మాత్రం 100 కోట్ల పైనే అని తెలుస్తుంది.బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా ఆ ఫీట్ సాధించింది.
ఈసారి కూడా ఆదిపురుష్ తో ఫస్ట్ డే 100 కోట్లు(
100 Crores ) కొట్టాలని చూస్తున్నాడు.
ఇప్పటికే నార్త్ సైడ్ ఆదిపురుష్ టికెట్స్ ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.తెలుగు రెండు రాష్ట్రాల్లో బుధవారం నుంచి అవి అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది.కేవలం తెలుగులోనే 50 కోట్ల మార్క్ టచ్ చేయాలని ఫ్యాన్స్ మంచి ఊపు మీద ఉన్నారు.
రామాయణ కథతో తీసిన ఆదిపురుష్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ ఏర్పడింది అంటే అది ప్రభాస్ వల్లే అని అంటున్నారు.అయితే దేవుడి కథ కాబట్టి ఆ కథకు ఎవరు కావాలో ఆయనే సెట్ చేసుకున్నారని చెప్పొచ్చు.
సినిమా అనుకున్న విధంగా ఆడియన్స్ అంచనాలను రీచ్ అయితే మాత్రం రికార్డులు బద్ధలు కొట్టే వసూళ్లు వస్తాయని మాత్రం చెప్పొచ్చు.