బాలీవుడ్ క్రేజీ హీరోలు స్ట్రాంగ్ పీఆర్ ని మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడిప్పుడే మన స్టార్స్ కూడా పీఆర్ టీమ్ ను సెట్ చేసుకుంటున్నారు.
స్ట్రాంగ్ పీఆర్ టీమ్ ని సెట్ చేసుకుని ప్రమోషన్స్ చేయించుకుంటూ ఉంటారు.ఇదే ఫార్ములాను విజయ్ దేవరకొండ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
సినిమాల ప్రమోషన్స్ మాత్రమే కాకుండా యాడ్స్ ప్రమోషన్స్ ని కూడా టీమ్ చూసుకుంటారు.
విజయ్ దేవరకొండకు కూడా బాలీవుడ్ కు సంబంధించిన టీమ్ పని చేస్తుందని టాక్.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పీఆర్ టీమ్ సెట్ చేసుకున్నట్టు టాక్.తన టీమ్ పుష్ప సినిమా రిలీజ్ సమయంలో బాగా పని చేసింది.
ఇప్పుడు ఇలాంటి పీఆర్ టీమ్ నే రామ్ చరణ్ కోసం కూడా ఆయన భార్య ఉపాసన సెట్ చేసినట్టు తెలుస్తుంది.

తన భర్త కోసం ఉపాసన కొణిదెల స్పెషల్ కేర్ తీసుకుంటుంది అని తాజాగా టాక్.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యాడు.
ప్రెజెంట్ అయితే చరణ్ లైనప్ ఇంట్రెస్టింట్ దర్శకులతో సాగుతుంది.

ఈ క్రమంలోనే ఉపాసన రామ్ చరణ్ క్రేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉపాసన పీఆర్ టీమ్ ని పర్యవేక్షిస్తున్నారు.తన ప్రమోషన్స్ కి సంబందించిన ప్రతీ విషయాన్నీ ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నారని.తెలుస్తుంది.
చూడాలి మరి ఆర్సి15 సినిమాకు పీఆర్ టీమ్ ఎంత వరకు ఉపయోగ పడుతుందో.ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.
దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.







