పవన్ కళ్యాణ్ గత ఏడాది మరియు అంతకు ముందు ఏడాది ఒక్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
ముఖ్యంగా గత ఏడాది విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టిన విషయం తెల్సిందే.పవన్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలను చేస్తున్నాడు.
అందులో హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తి అయ్యింది.నిన్న సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నట్లుగా పవన్ నుండి ప్రకటన వచ్చింది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది పవన్ నటిస్తున్న సినిమాలు రెండు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించడం లేదు.

కనుక అసలు ఈ ఏడాది ఒక్కటి అయినా విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హరి హర వీరమల్లు సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదిలోనే విడుదల అవ్వబోతుంది.ఇక దానయ్య నిర్మిస్తున్న సాహో సుజీత్ దర్శకత్వంలోని సినిమాను కూడా ఇదే ఏడాదిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
సుజీత్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్న సినిమాను కేవలం 30 వర్కింగ్ డేస్ లోనే ముగించబోతున్నారట.ఒక సూపర్ హిట్ తమిళ్ మూవీకి అది రీమేక్ అని.అందుకే తక్కువ సమయంలోనే రీమేక్ షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది.కనుక ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రావడం పక్కా.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే వినోదయ్య సిత్తం సినిమా యొక్క రీమేక్ కూడా ఇదే ఏడాదిలో వచ్చినా ఆశ్చర్యం లేదు.
