ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో పదవుల పంచాయతీ మొదలైంది.ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో మాణిక్ రావు ఠాక్రేతో షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, బలరాం నాయక్ భేటీ అయ్యారని తెలుస్తోంది.కాగా షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు మంత్రి పదవులు ఆశిస్తున్నారని తెలుస్తోంది.
అయితే రేపు ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.ఈ క్రమంలో మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







