టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో నాగశౌర్య ఒకరు కాగా ఛలో తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నా నాగశౌర్య( Naga Shaurya)కు ఆశించిన స్థాయి హిట్ అయితే దక్కడం లేదనే సంగతి తెలిసిందే.రంగబలి( Rangabali ) సినిమాతో నాగశౌర్య ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
టీజర్ గోపరాజు రమణ( Goparaju Ramana ) నాగశౌర్య పాత్ర గురించి మాట్లాడుతూ “మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను.వాడి వెధవతనాన్ని వర్ణించలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి” అని చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది.
జులై నెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.యుక్తీ తరేజా( Yukti Thareja Indian model ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సీహెచ్ పవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం.

అటు మాస్ ప్రేక్షకులకు, ఇటు క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ టీజర్ ఉంది.దసరా ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు సైతం నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.బాధ్యత లేకుండా తిరిగే కొడుకు కథతో ఈ సినిమా తెరకెక్కింది.గోదావరి యాసలో నాగశౌర్య మెప్పించారు.

నాగశౌర్య ఈ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.నాగశౌర్య రెమ్యునరేషన్( Remuneration పరిమితంగానే ఉందని తెలుస్తోంది.ఎంతో టాలెంట్ ఉన్న నాగశౌర్య సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ కావడం కష్టం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
యంగ్ హీరో నాగశౌర్యకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







