టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలకు ఫాదర్‌లుగా ఎక్కువగా జగపతిబాబు మరియు రాజేంద్ర ప్రసాద్‌లు కనిపిస్తున్నాయి.అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన తండ్రిగా పోసాని కృష్ణ మురళిని ఎంపిక చేసుకున్నాడు.
ఇటీవలే ‘బ్రూస్‌లీ’ చిత్రంతో అట్టర్ ఫ్లాప్ సాధించిన రామ్ చరణ్ తన తర్వాత సినిమాగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తని ఒరువన్’ రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే.ఈ రీమేక్‌లో రామ్ చరణ్‌కు తండ్రి పాత్రకు గాను పోసాని కృష్ణ మురళిని ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్‌కు ‘లోఫర్’ చిత్రంలో లోఫర్ తండ్రిగా నటించాడు.‘లోఫర్’ చిత్రంలో పోసాని పాత్రకు గాను మంచి మార్కులు పడ్డాయి.
అంతకు ముందు ‘టెంపర్’ చిత్రంలో కూడా పోసాని పోషించిన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.దాంతో పోసానికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ఈసారి ఏకంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు తండ్రిగా నటించే అవకాశాన్ని ఈయన దక్కించుకున్నాడు.ప్రస్తుతం చరణ్ సోదరి శ్రీజ వివాహ వేడుక పనుల్లో మెగా ఫ్యామిలీ బిజీగా ఉంది.
ఆ వేడుక పూర్తి అయిన తర్వాత చరణ్ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది.అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.







