రానా కవచంతో నాని రానున్నాడా?

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెరంగేట్రం చేసిన దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఆ సినిమా ఆ అంచనాలను అందుకుని సక్సెస్‌ అయ్యింది.

 Nani To Do Rana’s Kavacham..?-TeluguStop.com

దాంతో ఈ దర్శకుడికి భారీ క్రేజ్‌ పెరిగింది.ప్రస్తుతం ఈయన తన తర్వాత సినిమా చర్చల్లో బిజీగా ఉన్నాడు.

‘అందాల రాక్షసి’ సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఈ దర్శకుడు తన తర్వాత సినిమాగా రానా హీరోగా ‘కవచం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడు.‘కవచం’ కథ రానాతో పాటు సురేష్‌బాబుకు కూడా నచ్చింది.

దాంతో రానా హీరోగా, సురేష్‌బాబు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరిగింది.కాని ఆ సినిమా కొన్నాళ్లకు అటకెక్కింది.

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సక్సెస్‌ అవ్వడంతో తన ‘కవచం’ను హను రాఘవపూడి బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నాడు.తన తర్వాత సినిమాను కూడా నాని హీరోగా 14 రీల్స్‌ నిర్మాణంలో చేస్తాను అని ఇప్పటికే ప్రకటించిన దర్శకుడు హను రాఘవపూడి ‘కవచం’ చిత్రాన్ని వారితో చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రం షూటింగ్‌ సమయంలోనే తన వద్ద ఉన్న ‘కవచం’ చిత్రం కథను ఈ దర్శకుడు నాని మరియు 14 రీల్స్‌ నిర్మాతలకు చెప్పాడని, వారు ‘కవచం’ కోసం సిద్దం అంటూ అప్పుడే చెప్పారు.అందుకే త్వరలో ‘కవచం’ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.

అప్పట్లో ఎక్కువ బడ్జెట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమా నుండి రానా మరియు సురేష్‌బాఋ తప్పుకున్నట్లుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube