తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతేకాకుండా స్టార్ హీరోలు అందరూ సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆలంరించారు.తండ్రిగా, పోలీసు ఆఫీసర్ గా,విలన్ గా, కమెడియన్ గా ఇలా ఏ పాత్ర పోషించిన ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలనటుడు నాజర్.
ఇటువంటి పాత్రలో అయినా కూడా ఇట్టే ఒదిగిపోతూ ఉంటాడు.ఇకపోతే ఈ మధ్యకాలంలో నాజర్ సినిమాలలో అంతగా కనిపించడం లేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా నాజర్ కు సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది.ఆ వార్త విన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అసలేం జరిగిందంటే.తాజాగా హైదరాబాదులోని పోలీస్ అకాడమీలో ఒక షూటింగ్ జరుగుతుంది.
ఇక షూటింగ్ లో భాగంగా పాల్గొన్న నాజర్ కు గాయాలయ్యాయి అని సమాచారం.అయితే నా జరుకు గాయాలు అవ్వడంతో వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారట.
అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉంటే నాజర్ ఇకపై యాక్టింగ్ కు పదవి విరమణ ఇవ్వాలని అనుకుంటున్నట్లు జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.కాగా అనారోగ్య పరిస్థితుల కారణంగా నాజర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ మధ్యకాలంలో నాజర్ ఆరోగ్య పరిస్థితి అంతగా బాగోలేదని అందువల్లే సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే నాజర్ గాయాలు అయ్యాయి అని తెలియడంతో అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ప్రమాదానికి సంబంధించిన కారణం,అలాగే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది అన్న దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







