పేద కుటుంబాలకు ఉచిత LPG కనెక్షన్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన( PMUY ) ప్రారంభించింది.దీనివల్ల ఎందరో పేద మహిళలు లబ్ది పొందారు.
సులభంగా వంట పూర్తి చేసి మహిళలు తమ శ్రమ తగ్గించుకున్నారు.అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 25% మంది PMUY లబ్ధిదారులు ఒక్క సిలిండర్‌ను కూడా కొనుగోలు చేయలేదని తాజాగా తేలింది.1.51 కోట్ల మంది ప్రజలు ఒకే సిలిండర్‌ను కొనుగోలు చేశారని ఇటీవలి సమాచార హక్కు ( RTI ) రిపోర్ట్ వెల్లడించింది.దీనికి ప్రధాన కారణం ఎల్‌పీజీ సిలిండర్ల ధర చాలా ఎక్కువగా ఉండటమేనని చెప్పొచ్చు.

పీఎమ్‌యూవై (PMUY) సిలిండర్ ధర జనవరి 2018 నుంచి 82% పెరిగింది, మార్చి 2023లో రూ.495.64 నుంచి రూ.903కి పెరిగింది.ఇటీవల రూ.200 తగ్గించిన తర్వాత కూడా చాలా మంది పేద కుటుంబాలకు సిలిండర్ ఖరీదుగానే ఉంది.పీఎమ్‌యూవై సిలిండర్‌ల సగటు రీఫిల్లింగ్ సంవత్సరానికి 4 కంటే తక్కువగా ఉంది, నాన్-పీఎమ్‌యూవై సిలిండర్లను ఏడాదికి సగటున 6.67 సిలిండర్లను రీఫిల్ చేయిస్తున్నారు.సబ్సిడీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని, అంతర్జాతీయ ఎల్‌పీజీ ధరల ప్రకారం సిలిండర్ల ధరల్లో మార్పులు జరుగుతున్నాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి.అయితే తాజాగా అంతర్జాతీయ ధరల ప్రకారం రూ.200 తగ్గింపు కనిపించినా.మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పేద కుటుంబాలు కట్టెల పోయ్యిలతో బాధపడకుండా ఉండేందుకు, వారికి ఎల్పీజీ సిలిండర్ల ధరలు( Gas Cylinder Rate ) అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.ఇందులో సబ్సిడీని పెంచడం లేదా సిలిండర్‌లను కొనుగోలు చేయడంలో వారికి సహాయపడేందుకు ఆర్థిక సహాయం అందించడం వంటివి ఉంటాయి.







