ముకుందా సినిమాతో గోపికమ్మగా ముద్దుగా,హోమ్లీగా పరిచయం అయిన పూజాహెగ్డే.దువ్వాడ జగన్నాదంలో తన అందచందాలతో కుర్రాళ్ల గుండె కొల్లగొట్టింది.
రంగస్థలంలో జిగేల్ రాణిగా మెరిసి మురిపించింది.కెరీర్లో ఆచితూచి అడుగేస్తున్న హీరోయిన్లలో పూజాహెగ్దే ఒకరు.
ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే పెట్టె సర్దుకుని వెళ్లిపోవాల్సిందే మరి.అలా వెళ్లిపోయిన హీరోయిన్స్ ఎంతో మంది… ఈసారి తన వంతేనేమో అని పూజ భయపడుతుంది…దానికి కారణం.

ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సాక్ష్యం’ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడమే ఈ అమ్మడు భయానికి కారణం.ఈ సినిమాలో నటించడమే తప్పుగా భావిస్తుంది.ఇకపై కెరీర్ ఎలా ఉండబోతోందో.? అని కంగారు పడుతోంది.మరోవైపు.ఆ సినిమాలో ఆమె నటనపై విపరీతంగా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.ఈ సినిమాలో నటించేందుకు తొలుత పూజా హెగ్డే నో చెప్పిందట.కానీ.
ఆమె టీమ్‌లోని సభ్యులు “బాహుబలి” లాంటి సినిమా అవుతుందని.పారితోషికం కూడా పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉందని చెప్పారట.
దాంతో చివరికి పూజా ఒప్పుకుందట.కానీ సినిమా నిరాశపరచడంతో.
మాయ మాటలతో నన్ను మోసగిస్తారా.? అని టీమ్‌పై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యిందట…
త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంపై ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంది.అజ్ణాతవాసి సినిమాతో త్రివిక్రమ్ గ్రాఫ్ కొంచెం పడిపోయిన సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ కి కూడా ఈ చిత్రం ఒక సవాల్ లాంటిదే.మరోవైపు ఎన్టీయార్ ,త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తొలిచిత్రం.అటు ఎన్టియార్ అభిమానులకు సినిమాపై భారి అంచనాలున్నప్పటికి,త్రివిక్రమ్ అజ్ణాతవాసి లానే ఈ సినిమాను తెరకెక్కిస్తాడేమో అని భయపడుతున్నారు.
ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే,లేదంటే తన నటనపై విమర్శలు వస్తే తన కెరీర్ మటాష్ అని తెగ బాధపడుతుందట.చూడాలి ఏం జరుగుతుందో.







