టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ప్రస్తుతం పూజా హెగ్డే ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది.ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పూజా, అటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా స్టార్ సినిమాలు చేస్తోంది.
అయితే తెలుగులోనే ఎక్కువ క్రేజ్ దక్కించుకున్న పూజా, ఇక్కడి నిర్మాతలకు మాత్రం చుక్కలు చూపిస్తోందట.కెరీర్ ప్రారంభంలో తక్కువ రెమ్యునరేషన్‌కే సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు అమాంతం రెమ్యునరేషన్ పెంచేసింది.
ఇటీవల వరుసగా బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న పూజా హెగ్డే డేట్ల కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.దీంతో ఆమె తన రెమ్యునరేషన్‌ను పెంచుతున్నట్లు వారికి చెప్పేసిందట.
ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షణ్‌లో తెరకెక్కబోయే సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.దీంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసిందట.నిర్మాతలు ఈ మొత్తానికి ఓకే చెప్పేసి ఆమెను ఈ సినిమాలో నటింపేలా ఒప్పించారు.
దీంతో మహేష్‌తో గతంలో చేసిన మహర్షి చిత్రానికంటే కూడా ఇప్పుడు పూజా హెగ్డే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీుకుంటుందని టాలీవుడ్‌లో టాక్ వనిపిస్తోంది.ఇక వీరిద్దరి కాంబినేషనల్‌లో వచ్చిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో మరోసారి ఆమెను మహేష్ సరసన హీరోయిన్‌గా తీసుకోవాలని త్రివిక్రమ్ భావించాడు.
ఏదేమైనా స్టార్‌డమ్ పెరుగుతున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని పూజా హెగ్డేకు కూడా అర్థం అయిపోయిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.ఇక ఆమె ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేసింది.
మరి మున్ముందు అమ్మడు తన రెమ్యునరేషన్ ఇంకా ఎంతవరకు పెంచుతుందో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.