ఆ హీరోకు ఫిదా అయిన పూజా హెగ్డే.. అసలేమైందంటే..?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో నంబర్ 1 హీరోయిన్ గా నటి పూజా హెగ్డే ఒక వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే.పూజా హెగ్డే ప్రస్తుతం రికార్డు స్థాయిలో తీసుకోవడంతో పాటు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు పూజా హెగ్డే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు.

 Pooja Hegde Flats To Thalapathy Vijay Attitude And Behavior In Beast Movie Shoot-TeluguStop.com

ఈ స్టార్ హీరోయిన్ కోలీవుడ్ హీరో విజయ్ కు ఫిదా అయిపోయారని తెలుస్తోంది.విజయ్ హీరోగా బీస్ట్ సినిమా తెరకెక్కుతుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

షూటింగ్ సమయంలో హీరో విజయ్ తో పాటు బీస్ట్ మూవీ ప్రొడ్యూసర్స్ పూజా హెగ్డేతో పాటు ఆమెతో ఉండే సిబ్బందికి సైతం స్టార్ హోటల్ లో వసతి కేటాయించారని సమాచారం.హీరో, ప్రొడ్యూసర్స్ చూపిన అభిమానం మరియు కేర్ కు పూజాహెగ్డే టీమ్ మెంబర్స్ కూడా ముచ్చటపడిపోయారని తెలుస్తోంది.

సినిమాలో చిన్న నటుని విషయంలో కూడా విజయ్ స్పెషల్ కేరింగ్ తీసుకోవడం చూసి పూజా హెగ్డే ఫ్లాట్ అయ్యారని సమాచారం.

Telugu Beast, Beast Set, Hotel, Kollywood, Pooja Hegde, Poojahegde, Tollywood, V

సాధారణంగా సినిమా షూటింగ్ అంటే హీరో షూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరూ సైలెంట్ గా ఉంటారు.అయితే విజయ్ సెట్స్ లోకి వస్తే మాత్రం షూటింగ్ లొకేషన్ లోని వాతావరణమంతా సందడిగా మారుతుందని సమాచారం.స్టార్ హీరో అయినప్పటికీ విజయ్ ఆ గర్వాన్ని ప్రదర్శించడానికి అస్సలు ఇష్టపడరని తెలుస్తోంది.

విజయ్ ను స్టార్ హీరోయిన్లు మెచ్చుకోవడం ఇదే తొలిసారి కాదు.

Telugu Beast, Beast Set, Hotel, Kollywood, Pooja Hegde, Poojahegde, Tollywood, V

గతంలో కూడా కొంతమంది స్టార్ హీరోయిన్లు సెట్ లో విజయ్ ప్రవర్తన గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అనుకున్న తేదీకి ఈ సినిమా రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.ఈ మూవీపై తెలుగు, తమిళంలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube