గత కొద్ది కాలంగా పూజ హెగ్డే( Pooja Hegde ) సినిమా ఆఫర్స్ విషయంలో ఇబ్బందులు పడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే.ఆమె కొన్ని సినిమాలు వదిలేసుకుంది, కొంతమంది ఆమెని వదిలేసుకున్నారు.
మొత్తంగా చూస్తే పూజ హెగ్డే గత రెండేళ్లలో ఒక్క తెలుగు సినిమా కాదు కదా ఏ సినిమాలో ను నటించలేదు.మరి ఇకపైన నైనా ఆమెను వెండితెరపై మనం చూస్తామని గ్యారెంటీ లేదు.
ఎందుకంటే ప్రస్తుతం బుట్ట బొమ్మ చేతిలో ఒక సినిమా లేకపోగా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది.ఆ నిర్ణయం వల్ల ఆమె ఇక తెలుగు లోనే కాదు వెండితెరపై కూడా కనిపించే అవకాశం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది.
ఇంతకు ఆ నిర్ణయం ఏంటి ? దానివల్ల ఆమెకు జరగబోయే మేలు ఎంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కొత్త హీరోయిన్స్ రావడం తో పూజ హెగ్డే కి వరస అవకాశాలు తగ్గిపోయాయి.అరకొర అవకాశాలు వస్తుంటే ఆ అమ్మడు వాటిని కూడా కాదనుకుంది.దాంతో ఆమెను కావాలనుకునే నాధుడే లేకుండా పోయాడు.
అంత టాలెంట్ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోయింది ప్రస్తుతం పూజా హెగ్డే కి.సరే ఏది ఏమైనా ఆమె డిజిటల్ రంగంలో అడుగుపెడుతుంది అనే వార్త ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి.ఇప్పటికే కాజల్, సమంతా, తమన్నా లాంటి హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఓటిటి కంటెంట్( OTT Content ) చేసుకొని బండి లాగుతున్నారు.వారికి గండి కొట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది పూజ హెగ్డే.
సినిమాలు ఎలాగూ రావడం లేదు దాంతో ఓటిటి( OTT ) లో ఏదో ఒక సినిమా చేసి తన టాలెంట్ ఏంటో మరో మారు అందరికీ ప్రూవ్ చేయాలనుకుంటుంది.

అందుకే ప్రస్తుతం తమిళ దర్శకుడైన అజయ్ జ్ఞానముత్తు( Director Ajay Gnanamuthu ) దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతోంది.ఈ ప్రాజెక్టు సైన్ చేసిన విషయం బయటకు రాగానే అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.ఇక ఈ వెబ్ సిరీస్ విజయం సాధిస్తే డిజిటల్ రంగంలోనే పూజ హెగ్డే సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది.
ఈ వెబ్ సిరీస్ ఒక ప్రముఖ ఓటిటి ఛానల్ లో రాబోతున్నట్టుగా తెలుస్తోంది.