ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని ఆ తర్వాత గోల్డెన్ లెగ్ గా మారిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పూజా హెగ్డే మాత్రమే.మొదట్లో ఫ్లాప్ సినిమాతో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇబ్బంది పడ్డ పూజ ఆ తర్వాత వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పుడు మళ్లీ టైం రివర్స్ అయింది అనుకుంటా పాపం ఈ అమ్మడికి మళ్లీ బ్యాక్ టైమ్ నడుస్తోంది అందుకే వారస ఫ్లాపులు ఆమెను సతమతం చేస్తున్నాయి.వరుస హిట్టు రావడంతో పాటు వరుసగా క్రేజీ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఎంపిక అవుతూ వచ్చిన పూజా హెగ్డే బీస్ట్, ఆచార్య, రాదే శ్యామ్ వంటి సినిమాలలో నటించింది.
ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో పూజ హెగ్డే కెరియర్ కూడా డేంజర్ జోన్ లో పడింది.
అయితే ఒక్కోసారి టైం బాగోలేకపోతే కమర్షియల్ హీరోయిన్ అయినా సరే కష్టాలు తప్పవు.
తన తోటి హీరోయిన్లు రష్మీక, కృతి శెట్టి ప్యాన్ ఇండియా సినిమాలతో, క్రేజీ ప్రాజెక్టులతో హిట్లు సంపాదించుకుని మెల్లిగా నెంబర్ వన్ హీరోయిన్స్ గా మారుతుంటే వరుస పరాజయాలతో పూజ హెగ్డే మాత్రం డౌన్ ఫాల్ చూస్తోంది.ఇక ఇలాంటి టైంలో పూజ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు చివరికి ఐటెం సాంగ్ వచ్చినా కూడా తప్పకుండా చేస్తుంది.
ఇకపోతే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే రెండు సినిమాలు ఓకే అయ్యి అవి సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది.

ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన జనగణమన సినిమా కోసం పూజా హెగ్డేను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఓకే చేశారు.కానీ లైజర్ సినిమా ఎఫెక్ట్టో ఈ చిత్రానికి బడ్జెట్ తగ్గించేసారట నిర్మాతలు.దాంతో పాటు పూజకి రెమ్యునరేషన్ కూడా తగ్గిస్తున్నట్టుగా చెప్పడంతో ఆమె ఈ సినిమాలో కంటిన్యూ అవ్వాలా లేదా అన్న సందిగ్ధంలో ఉందట.
తక్కువ పారితోషకం ఇస్తే ఆమె తప్పుకుంటుంది అన్న భావనలో పూరీ టీం ఉన్నారట.ఇక ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్ కూడా పూజ అటెండ్ అయింది.ఇలా వరుస షాకులతో పూజ హెగ్డే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.







