నందమూరి తారక రామారావు… నిమ్మకూరులో పుట్టి యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీని సంపాదించుకొని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి సీఎంగా జాతికి ఆయన చేసిన సేవ అనిర్వచనీయం.కేవలం హీరోగా ఉంటే తను మాత్రమే బాగుపడతానని కానీ రాజకీయాల్లోకి వస్తే తెలుగు జాతి కూడా గర్విస్తుందని ఎంతో మందికి సేవ చేసిన తృప్తి కూడా మిగులుతుందని ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు.
ఆయన రాజకీయ జీవితం గురించి ఈ కాసేపు పక్కన పెడితే ఆయన కుటుంబం నుంచి ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.వాస్తవానికి హరికృష్ణ, బాలకృష్ణ మాత్రమే సినిమాల్లో కనిపించడంతో వీరిద్దరే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు అని అనుకుంటారు కానీ ఆయన కుమారులు నలుగురు కూడా ఆ సినిమా ఇండస్ట్రీలో పనిచేశారు.
నందమూరి రామకృష్ణ తొలినాలలో ఎడిటర్ గా సమర్పికుడిగా ఉంటే, హరికృష్ణ బాలకృష్ణ హీరోలుగా రాణించారు.ఇక నందమూరి మోహన కృష్ణ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.అయితే కేవలం తన కుమారులను మాత్రమే అగ్ర హీరోలుగా చేసి కుమార్తెను సినిమా ఇండస్ట్రీకి తీసుకురాలేదు అని అనుకుంటారు.అంతేకాదు అప్పట్లో సినిమా ఇండస్ట్రీపై అనేక అపోహలు ఉండేవి.
అక్కడ వ్యసనాలు ఎక్కువ అని సినిమా ఇండస్ట్రీకి వస్తే పాడైపోతారు అనే భావనతో ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చేవారు కాదు.ఇక్కడ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆయన కుమార్తె కూడా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది అని.అదేంటి కేవలం కుమారులే కదా ఇండస్ట్రీకి వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా ? కానీ అది నిజం.

ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి సైతం ఒక సినిమా లో నటించింది.పురందరేశ్వరి శ్రీకృష్ణ అవతారం సినిమాలో బుల్లి శ్రీకృష్ణుని పాత్రలో నటించింది.మళ్లీ మరొక సినిమాతో ఆమెను నటింపచేయాలని ఎన్టీఆర్ భావించినా కూడా అందుకు ఆయన భార్య బసవతారకం ఒప్పుకోలేదు.
పాడవుతాయి అని ఎన్టీఆర్ ను వారించి మరీ పురందరేశ్వరిని సినిమా ఇండస్ట్రీకి రాకుండా చేసింది.అలా ఇండస్ట్రీ కి రావాల్సిన ఎన్టీఆర్ కూతురు అక్కడితో నటనని ఆపేసింది.
ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకు సైతం ఖచ్చితంగా తెలియదు.ప్రస్తుతం పురందరేశ్వరి బిజెపిలో ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటుంది.







