తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది పూజా హెగ్డే.
ఈ ముద్దుగుమ్మను అభిమానులు బుట్ట బొమ్మ అని కూడా ముద్దుగా పిలుస్తూ ఉంటారు.ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు తమిళ హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
అయితే ఆమె నటించిన సినిమాలు గత ఫ్లాప్ కావడంతో పూజ హెగ్డే కాస్త స్లో అయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా పూజా ఒక పాపులర్ అవార్డు ఫంక్షన్ లో భాగంగా స్టేజ్ మీద డాన్స్ ను ఇరగదీసింది.కోలీవుడ్ లో గతే ఏడాది బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే.ఈ వేడుకలో ఎంతోమంది సెలబ్రిటీలు అవార్డులు అందుకొనడంతో పాటు మరి కొందరు పెర్ఫార్మన్స్ లను ఇరగదీశారు.
ఇక అందులో పూజా హెగ్డే చేసిన స్టేజ్ పెర్ఫార్మన్స్ ఎక్కువ హైలైట్ అయ్యిందని చెప్పవచ్చు.ఆ వేడుకలో మెరుస్తున్న రెడ్ డ్రెస్ ధరించి స్టేజ్ ని షేక్ చేసేసింది పూజా హెగ్డే.
అల వైకుంఠపురంలో, బీస్ట్ సినిమాల మిక్సెడ్ మాషప్ సాంగ్స్ తో పెర్ఫార్మన్స్ ఇరగదీసింది.

దీంతో అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కి పూజా డ్యాన్స్ ఫుల్ మీల్స్ లా ఎక్కేసింది.కాగా పూజ హెగ్డే డాన్స్ చేసిన వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవ్వడంతో పాటుగా కోటికపైగా వ్యూయర్షిప్ తో ఇప్పటికీ ఆ వీడియో ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది.హీరోయిన్స్ స్టేజ్ పై ఆ స్థాయిలో పెర్ఫార్మన్స్ తో అలరించారంటే దాని కోసం వారు ఏ స్థాయిలో ప్రాక్టీస్ చేసి ఉంటారో ఊహించవచ్చు.
పది నిమిషాల పెర్ఫార్మన్స్ కోసం కొన్ని రోజులపాటు వారు ప్రాక్టీస్ చేస్తుంటారు.







