తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోల్లో అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు.ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరక్షన్ లో పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తారో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు… కానీ సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది.అదేంటంటే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలో ఆ ఐరన్ లెగ్ హీరో యిన్ కి అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఇంతకీ అల్లు అర్జున్ అవకాశం ఇవ్వబోయే ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అర్జున్ తన సినిమా హి )ట్ అయినా ప్లాప్ అయినా సరే కానీ అందులో ఉండే వాళ్ళ టాలెంట్ చూసి ఆయన తన నెక్స్ట్ సినిమాల్లో అవకాశం ఇస్తాడు.అలా ఇప్పటికే చాలామంది హీరోయిన్లకు వారి టాలెంట్ చూసే సినిమాల్లో అవకాశం ఇచ్చాడు.ఇక అల్లు అర్జున్ కి గోల్డెన్ హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డే ( Pooja Hegde )పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎటు కాకుండా పోయింది.

ఇక దువ్వాడ జగన్నాథం అలవైకుంటపురం( Ala Vaikunthapurramuloo) లో సినిమాలతో అల్లు అర్జున్ కి మంచి హిట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బీస్ట్,రాధే శ్యామ్,ఆచార్య వంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ కి ప్రస్తుతం తెలుగులో అంతగా ఆఫర్స్ లేవు అని చెప్పుకోవచ్చు.కేవలం త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చే సినిమా తప్ప ఇంకో అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది…
ఇక ఇలాంటి నేపథ్యంలో ఆ ప్లాప్ హీరోయిన్ కి తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ విషయం తెలిసిన నెటిజన్స్ హీరోయిన్ మీద ఇష్టంతో తన సినీ కెరీర్ ని అల్లు అర్జున్ రిస్కులో పడేస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక మరి కొంతమంది అయితే పూజ హెగ్డే ని అస్సలు తీసుకోవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.మరి ఇందులో అసలు నిజం ఏంటో తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే…








