కోలీవుడ్ ( Kollywood ) ఇండస్ట్రీ నుండి వచ్చిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 1 ( Ponniyin Selvan 1 ).ఈ సినిమా వచ్చిన సమయంలో కోలీవుడ్ ప్రేక్షకులు తమిళ్ బాహుబలి అంటూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం ( Mani Ratnam ) తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసారు.ఈ సినిమా 500 కోట్లకు పైగానే వసూలు చేసింది.

ఇక పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో మణిరత్నం పార్ట్ 2 ( Ponniyin Selvan 2 ) ను మరింత వేగంగా పూర్తి చేసాడు.ఇక పొన్నియన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అయ్యింది.పార్ట్ 2 కూడా బిగ్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది.ఈ సినిమా కూడా మంచి టాక్ రాగా కలెక్షన్స్ పరంగా కూడా రాణిస్తుంది.పార్ట్ 1 తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్స్ అందుకుంది.
కానీ ఈ సినిమాకు మరో సినిమా పోటీ లేకపోవడంతో సూపర్ హిట్ దిశగా సాగిపోతుంది.
అయితే ఇక్కడ కంటే కూడా యూఎస్ లో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది.తాజాగా యుఎస్ (USA) లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించినట్టు టాక్.
అక్కడ ఈ సినిమా రెండు రోజులలోనే 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక వీకెండ్ కావడంతో ఆదివారం ఈ సినిమా మరింత స్ట్రాంగ్ అయ్యేలా కనిపిస్తుంది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్ (Vikram ), హీరో కార్తీ (Karti), జయం రవి ( Jayam Ravi ), త్రిష ( Trisha ), ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai ) వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.
చూడాలి మరి ఈ సినిమా పార్ట్ 2 మొత్తం ఎంత వసూళ్లు సాధిస్తుందో.







