ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( MP Ponguleti Srinivas Reddy ) వ్యవహారం ఎవరికి అంతు చిక్కడం లేదు.బిజెపి, కాంగ్రెస్ లు ఆయనను చేర్చుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ అనుచరగణం ఉన్న పొంగులేటి ఆర్థికంగాను బలవంతుడు కావడంతో, ప్రధాన పార్టీలన్నీ ఆయనను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి .ఇక పొంగులేటి విధిస్తున్న డిమాండ్లు అన్నిటికీ అంగీకారం తెలుపుతున్నాయి.ఇప్పటికే కాంగ్రెస్ లో చేరాల్సిందిగా రాహుల్ గాంధీ టీం చర్చలు జరిపింది.ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లు మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ పొంగులేటి సూచించిన వారికి టిక్కెట్లు ఇస్తామని హామీ కూడా ఇచ్చింది.
అలాగే బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ( Chairman Etala Rajender )పొంగులేటితో చర్చలు జరిపారు.బిజెపిలో చేరితే రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కానీ తాజా రాజకీయాలను లెక్కలు వేసుకుంటున్న పొంగులేటి ఈ రెండు పార్టీల కంటే సొంతంగా పార్టీ పెట్టి, రాజకీయంగా తన బలం నిరూపించుకోవాలని చూస్తున్నారట.ఇక ఇప్పటికే టిఆర్ఎస్( TRS ) బీఆర్ఎస్ గా మారింది.
దీంతో తెలంగాణలో టిఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది.దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
టిఆర్ఎస్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేరింది.
.టిఆర్ఎస్ బీఆర్ఎస్( BRS ) పార్టీగా మారడంతో, టిఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించినట్లు తెలుస్తోంది.సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా, ఉపాధ్యక్షుడిగా తుపాకుల మురళి కంఠ, ప్రధాన కార్యదర్శిగా నల్లా శ్రీకాంత్( Nalla Srikanth ), కోశాధికారిగా సదుపల్లి రాజు పేరుతో ఎన్నికల సంఘానికి పంపిన దరఖాస్తులో పేర్కొన్నారు.
తెలంగాణ రాజ్యసమితి పేరుతో పేరు ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశారు.అయితే ఇది బయటకు టిఆర్ఎస్ గానే పిలవబడుతుంది.
ఇప్పటికే ఈ పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నెలరోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అనేక భాషల్లో వివిధ పత్రికల్లో ప్రకటన కూడా చేసింది.ఈనెల 27వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలను చెప్పుకునేందుకు అవకాశం కల్పించారు.ఇదిలా ఉంటే వీరితో టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీకి దరఖాస్తు చేయించింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన బిజెపి, కాంగ్రెస్ లలో చేరకపోతే ప్రత్యామ్నాయంగా టిఆర్ఎస్ ను ఎంచుకుంటారని ,దానిలో భాగంగానే మరో ఆప్షన్ గా టిఆర్ఎస్ పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించినట్లుగా విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాలోనూ అనుచరులు ఉన్నారు.
ఆయన బిజెపిలో చేరితే ఖమ్మం, నల్గొండ జిల్లాలో పెద్దగా ప్రభావం ఉండదు అని అంచనా వేస్తున్నారట.ఇక కాంగ్రెస్ లో చేరినా, ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాల కారణంగా తనకు ఇబ్బందులు ఎదురవుతాయని పొంగులేటి ఆలోచనలో పడ్డారట.
అందుకే ఈ రెండు పార్టీల కంటే సొంతంగా పార్టీ పెడితేనే మంచిదనే ఆలోచనతో తనకు నమ్మకమైన వ్యక్తుల ద్వారా టిఆర్ఎస్ పార్టీ పేరును రిజిస్టర్ చేయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.