తెలంగాణలో మరోసారి ముందస్తు రాగం..!

తెలంగాణలో బీజేపీ దూకుడు చూస్తుంటే.మరోసారి ముందస్తు ఎన్నికల పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.2014 ఎన్నికల తర్వాల సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా.ముందస్తుకు వెళ్లి విజయ దుందుభి మోగించారు.

 Political Strategy Of Bjp And Brs In Telangana , Early Elections Early Ele-TeluguStop.com

ఆతర్వాత ఇప్పుడు మరో్ సారి అదే వ్యూహాన్ని ఫాలో అవుతారని టాక్ నడుస్తోంది.నిజానికి ప్రతిపక్ష పార్టీలు ఆదమరిచి ఉన్నప్పుడు ముందస్తుకు వెళ్లడం.

తెలుగు నాట నడుస్తున్నదే.అప్పట్లో చంద్రబాబు సైతం ఇలా ముందస్తుకు వెళ్లారు.

అయితే కేసీఆర్ కూడా మొదట్లో.ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కనిపించినా.

తర్వాత ఆ ఆలోచన మానుకున్నట్టు ప్రచారం జరిగింది.

బీజేపీ మాత్రం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారు అని గట్టిగా ఫిక్స్ అయింది.

మరి ఏ సమచారం ప్రకారం ఇలా ఫిక్స్ అయిందో గానీ.వడివడిగా పావులు కదుపుతోంది.

పక్కా వ్యూహంతో.ప్రణాళికలు రచించి మరీ.రంగంలోకి దిగుతున్నారు.అందుకే టార్గెట్ 90 అంటూ కొత్త నినాదాన్ని తీసుకున్నారు.

అంతే కాకుండా.బల్దియా ఎన్నికల్లో మాదిరిగా.

చతురంగ బలాలను ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రతీ నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ.

నాయకులను నియమిస్తున్నారు.ఒక వైపు నియామకాలు చేపడుతూనే.

మరో వైపు చేరికలపై ఫోకస్ పెడుతున్నారు.

కేసీఆర్ కంటే ముందే.పక్కా వ్యూహంతో రాజకీయాలు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే బీజేపీ నేతలు ఏ మాత్రం చాన్స్ తీసుకోవడం లేదు.

పక్కా వ్యూహంతో కేసీఆర్ ముందస్తుకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో ఉండగానే.

బీజేపీ, బీఆర్ఎస్ లు రణరంగంలో తలపడాలని చూస్తున్నాయి.మరి నిజంగా బీజేపీ భావిస్తున్నట్టు ముందస్తు.

వస్తే.ఎవరికి కలిసొస్తుంది అనేది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube