కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ 135 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీకి 66 సీట్లు మాత్రమే వచ్చాయి.
కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం సిద్ద రామయ్య పోటీ పడుతున్నాడరు.ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య బలమైన పోటీదారుగా నిలిచారు.
సిద్ధరామయ్య ఒకసారి ముఖ్యమంత్రిగా, రెండుసార్లు డిప్యూటీ సీఎంగా ఉన్నారు.ప్రముఖ నాయకుడు సిద్ధరామయ్య( Siddaramaiah ) స్వాతంతత్య్రానికి 12 రోజుల ముందు అంటే 1947 ఆగస్టు 3న కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు.
సిద్ధరామయ్య తండ్రి సిద్ధరామగౌడ రైతు.మైసూరులోని టి.నరసీపుర సమీపంలోని వరుణ హోబ్లీలో వ్యవసాయం చేసేవాడు.సిద్ధరామయ్య తల్లి పేరు బోరమ్మ.
సిద్ధరామయ్యకు 10 ఏళ్ల వరకు అధికారిక పాఠశాల విద్య లేదు.దీని తరువాత, అతని చదువు గ్రామంలోని పాఠశాలలో ప్రారంభమైంది.

సిద్ధరామయ్య బి.ఎస్సీ పూర్తిచేసి, ఆ తర్వాత మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.ప్రముఖ న్యాయవాది చిక్కబోరయ్య దగ్గర జూనియర్‌గా పనిచేశారు.సిద్ధరామయ్య కొంతకాలం లా టీచర్‌గా కూడా పనిచేశారు.అయితే దేనిలోనూ అతని మనసు నిలువలేదు.దీంతో అతను రాజకీయాల్లో తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సిద్ధరామయ్య కర్ణాటకలోని కురుబ సామాజిక వర్గానికి చెందినవారు.ఈ సంఘం రాష్ట్రంలో మూడవ అతిపెద్ద జనాభాను కలిగి ఉంది.
సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఈ సామాజికవర్గం నుంచి కాంగ్రెస్‌కే ఎక్కువ మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ ( Congress party )సీనియర్ నేత సిద్ధరామయ్య రాజకీయ ప్రయాణం 1983లో తొలిసారిగా కర్ణాటక శాసనసభకు ఎన్నికవడంతో ప్రారంభమైంది.

తొలిసారి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.దీని తర్వాత నుంచి అతని స్థాయి పెరుగుతూనే వచ్చింది.1994లో కర్ణాటకలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది.ఈ ప్రభుత్వంలో సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.1999లో హెచ్‌డి దేవెగౌడ జనతాదళ్ సెక్యులర్‌ను ఏర్పాటు చేసినప్పుడు సిద్ధరామయ్య కూడా ఆయన వెంట వెళ్లారు.అయితే క్రమంగా దేవెగౌడ, సిద్ధరామయ్య మధ్య దూరం పెరగడంతో సిద్ధరామయ్య జేడీఎస్‌ను వీడారు.
సిద్ధరామయ్య దాదాపు రెండున్నర దశాబ్దాలుగా జేడీఎస్‌తో( JDS ) అనుబంధం కలిగి ఉన్నారు.అయితే ఆ తర్వాత ఆయన ఈ పార్టీపై విరక్తి చెందారు.జేడీఎస్‌ను వీడిన సిద్ధరామయ్య కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 2008లో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆయనకు ప్రతిఫలమిచ్చింది.2013లో ఐదేళ్ల తర్వాత సిద్ధరామయ్యను కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కించింది. దీంతో 5 సంవత్సరాలు కర్ణాటకను పాలించారు.అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ విజయం సాధించి సీఎం రేసులో సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారు.
సిద్ధరామయ్య 12 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు.ఇందులో అతను 9 సార్లు గెలిచాడు.
కాగా మూడుసార్లు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.సిద్ధరామయ్య రెండుసార్లు డిప్యూటీ సీఎంగా, ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు.







