టాలీవుడ్ ని తాకిన రాజకీయం! మూడు గ్రూపులుగా విడిపోయిన సినిమావాళ్ళు

ఏపీలో ఎన్నికల వేడి టాలీవుడ్ ఇండస్ట్రీని తాకిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.

ఏపీ రాజకీయాలలో తెలుగు సినీ పరిశ్రమకి చెందిన నటులు కళాకారులు భాగంగా ఉన్నా కూడా ఎప్పుడు ఈ స్థాయిలో వర్గాలుగా విడిపోయిన దాఖలాలు లేవు.

ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న సందర్భాలు లేవు.గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ కొంత వరకు అతనికి వ్యతిరేకంగా సినిమాలు తీసి టాలీవుడ్ లో రాజకీయ సెగలు రాజేశారు.

అయితే ఈ సారి ఏపీ ఎన్నికలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటులు నుంచి దర్శకులు, నిర్మాతల వరకు అందరూ ఏకంగా మూడు వర్గాలుగా విడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.టాలీవుడ్ లో కొంత మంది నటులు, రచయితలు, దర్శకులు వైసీపీ పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరుపున ప్రచారం చేయడమే కాకుండా నేరుగా ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న జనసేన అధినేత మెగా హీరో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసారు.

అవి కూడా చాలా ఘాటుగా చేసారు.ఇక మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నవారు, అలాగే పవన్ కళ్యాణ్ ని అభిమానించే చాలా మంది జనసేన పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొన్నారు.

Advertisement

ఇక నందమూరి ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నవారు, చంద్రబాబుకి మద్దతు ఇచ్చేవారు టీడీపీ కోసం పని చేస్తున్నారు.అయితే టీడీపీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ సపోర్ట్ లేదనే చెప్పాలి.ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఆధిపత్యం నడుస్తున్న సందర్భంలో ఏపీ ఎన్నికలలో వైసీపీ, జనసేనగా సినిమా ఇండస్ట్రీలో నటులు విడిపోయారు.

ఇప్పుడు ఏపీ రాజకీయల ప్రభావం భవిష్యత్తులో ఇండస్ట్రీలో నటుల అవకాశాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు