అంత రచ్చ చేయడం అవసరమా ... ఆ పార్టీలోనే కాదు మీ పార్టీలోనూ ఇంతే..!

ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనిపించిన అసంతృప్తులు, అలకలు ఇప్పడు అధికార పార్టీ టీడీపీ లో కూడా మొదలవుతున్నట్టు కనిపిస్తోంది.టీడీపీ లో పరిస్థితులు ప్రస్తుతానికి బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా.

 Political Counter Between Telugu Desam And Ysrcp-TeluguStop.com

లోలోపల మాత్రం నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు తెలుస్తోంది.ప్ర‌స్తుతం కూడా టీడీపీకి అంత అనుకూల ప‌వ‌నాలు వీస్తున్న‌ట్టుగా లేవ‌ని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ అందుతున్నాయట.

పైకి కనిపించకపోయినా.వైసీపీలో చెలరేగుతున్న అలజడులకంటే ఎక్కువగా టీడీపీలో ఎక్కువగా ఇది ఉన్నట్టు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై గెలుపొందిన 23 మందిని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ఆఫరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలో చేర్చుకున్నారు.వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికే టికెట్ ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు.

కానీ, ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈ వ్యూహం అనూహ్యంగా మారిపోయే ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి.వీరిలో దాదాపు 15 మంది కి టికెట్ ఇవ్వకూడదని బాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్న చంద్రబాబు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.అనుకూ కొంతమంది నాయకులకు బాబు టికెట్ ఇచ్చేందుకు ససేమీరా అంటున్నాడు.అయితే ఇలా చేస్తే.వారు అసంతృప్తికి గురి కారా ? అదే విధంగా సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేల్లో శింగ‌న‌మ‌ల స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మారుస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.దీనిని దృష్టిలో పెట్టుకుంటే.ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అసంతృప్తులు రావ‌డం కామ‌న్‌.

కానీ, ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకోకుండా టీడీపీ నాయ‌కులు వైసీపీని టార్గెట్ చేయ‌డం దారుణ‌మనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అధికార ప‌క్షం నాయ‌కులు పెద్ద ఎత్తున విరుచుకుప‌డ‌డం దారుణంగా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

గ‌తానుభ‌వాల‌ను టీడీపీ నాయ‌కులు మ‌రిచి పోతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి.గెలుపు గుర్రం ఎక్క‌డం అంత ఈజీ కూడా కాదు.త్రిముఖ పోటీ ఉంటుంద‌ని చెబుతున్న నేప‌థ్యంలో వచ్చే ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌వాహం కూడా ఆదే రేంజ్ లో ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ నేత‌ల‌ను ఓడించి అధికారంలోకి వ‌చ్చేందుకు జగన్ రకరకాల మార్పు చేర్పులకు దిగుతున్నాడు.ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా జగన్ ని అనుసరించక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube