సర్వేల పేరుతో పొలిటికల్ బిల్డప్ లు !  

ఏపీ, తెలంగాణలో ఎన్నికల సందడి అప్పుడే మొదలైనట్టుగా కనిపిస్తోంది.అన్ని రాజకీయ పార్టీలు ఈ మేరకు తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

 Political Buildups In The Name Of Surveys Tdp ,ysrcp, Telugu Desam, Trs ,congres-TeluguStop.com

అప్పుడే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి తమ రాజకీయ ప్రత్యర్థులపై ఏ విధంగా పై చేయి సాధించాలి అనే విషయంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు మైండ్ గేమ్ రాజకీయాలకు తెర లేపారు.

ఏపీ సంగతి పక్కన పెడితే , తెలంగాణలో రాజకీయాలు మాత్రం రసవత్రంగా మారాయి.టిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా,  బిజెపి ,కాంగ్రెస్ పార్టీలు గెలుపు తమదంటే తమదే అంటూ ప్రకటనలు చేస్తున్నాయి.

పాదయాత్రలు , జిల్లాల యాత్రలు , సభలు,  సమావేశాలు ఇలా అన్నిటిని నిర్వహిస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్ళేందుకు అన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

   ముఖ్యంగా ప్రజాబలం తమ వైపే ఉంది అని నిరూపించుకునేందుకు సర్వేలను తెర పైకి తీసుకొస్తున్నారు.

ఇటీవల కాలంలో వివిధ సర్వే సంస్థలు సర్వే తాలూకా ఫలితాలను విడుదల చేస్తున్నాయి.అందులో టిఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందంటూ ఒక సర్వే , కాంగ్రెస్ కే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ మరో సర్వే బయటకు వచ్చింది .ఇక బిజెపిదే అధికారం అంటూ ఇంకో సర్వే తెర పైకి వచ్చింది.ఇక ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందంటూ ఓ సర్వే ఫలితం విడుదల అయ్యింది.

అయితే ఆయా సర్వేల ఫలితాలు,  ఆ సర్వేలు నిర్వహించిన సంస్థల యొక్క పారదర్శకత ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఉత్తుత్తి సర్వేలుగా అన్నట్లుగానే జనాలు పెదవి విరుస్తున్నారు.
   

Telugu Congress, Jagan, Survys, Telugu Desam, Ysrcp-Politics

ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ సర్వే సంస్థలను సంప్రదించి, సర్వేలు చేయించి ఫలితం తముఖు అనుకూలంగా ఉండేలా ప్రకటనలు చేయిస్తున్నాయి అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగజేస్తున్నాయి.  ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది ఓటరు నాడి ఏ విధంగా ఉంది అనేది పోలింగ్ తేదీన కానీ స్పష్టమయ్యే అవకాశం లేదు.ఎన్నికల సమయం చాలా ఉండడంతో అప్పటికి రాజకీయ సమీకరణాలు,  పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.

కానీ ఇప్పటి నుంచే పలానా పార్టీ గెలవబోతోంది అంటూ సర్వే సంస్థల నివేదికలు విడుదల చేస్తున్న తీరు చూస్తుంటే ఆయా రాజకీయ పార్టీ ల ప్రోద్బలం తోనే ఈ విధమైన రాజకీయ ఎత్తుగడకు తెరతీశారా అనే అనుమానాలు సామాన్యుల్లోనూ వ్యక్తమవుతున్నా యి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube