టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారినియ్యో అందరికీ తెలిసిందే.ఆయనగారు చేసిన పిచ్చి వ్యాఖ్యలకు నేతలు సైతం ఆశ్చర్యపోయారు.
ఎప్పుడూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆయన ఏకంగా పోలీసుల పైన కూడా తన మార్క్ వ్యాఖ్యలను చేయడం తో అటు అధికార పక్షం తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆయనపై గుర్రు మంటుంది.ఈ నేపథ్యంలోనే నిన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తనదైన శైలి లో జేసీ సమాధానం చెప్పగా, ఇప్పుడు తాజాగా పోలీసులు తమ కోపాన్ని ప్రదర్శించే పనిలో పడ్డారు.
అలాంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఏమి చేతులు కట్టుకొని కూర్చోరు అన్నట్లుగా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.పోలీసు జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ అనంతపురం పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఆయన తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.మొత్తానికి జేసీ కి గట్టి ఝలక్ ఇవ్వాలని పోలీసులు గట్టిగా నిర్ణయించుకున్నారు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జేసీ పోలీసులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మరలా టీడీపీ అధికారంలోకి వస్తే బూట్లు నాకే వారిని తెచ్చుకుంటాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం సృష్టించింది.దీనితో పలువురు ఆయన తీరుపై మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే పోలీసులు సైతం కేసు నమోదు చేశారు.







