బన్నీ పై పోలీస్ కంప్లైంట్... అసలు విషయం ఏమిటంటే...?!

ఈ సంవత్సరం మొదట్లో సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అలా వైకుంఠపురం లో సినిమా తో భారీ హిట్ సాధించిన అల్లు అర్జున్ తర్వాత క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి పుష్ప సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మించబోతున్నారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ ప్రక్రియ మొదలైంది.

ఇది ఇలా ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.అయితే తాజాగా అన్ లాక్ ప్రక్రియ విధానంతో తిరిగి మళ్లీ సినిమా షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టింది పుష్ప టీం.ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా అల్లు అర్జున్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు అయ్యింది.

ఇందుకు అసలు కారణం అల్లు అర్జున్ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని.ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన సమితి ప్రతినిధులు అదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో అల్లుఅర్జున్ పై కంప్లైంట్ అందించారు.

జిల్లాలోనే కుంటాల జలపాతం చూడడానికి వచ్చే సందర్శకులను అధికారులు కరోనా వైరస్ నేపథ్యంలో నిలుపుదల చేసారు.ఇకపోతే అల్లుఅర్జున్ తో సహా పుష్ప చిత్ర బృందం మొత్తం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించారు.

Advertisement

అంతే కాదు, ఎటువంటి పర్మిషన్ లేకుండా తిప్పేశ్వర్ లో షూటింగ్ చేశారని దేవులపల్లి కార్తీక్ కంప్లైంట్ లో తెలియజేశారు.ఈ విషయంపై ఫిర్యాదు అందించేందుకు సదరు సంఘం ప్రతినిధులు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ డిఎఫ్ఓ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోని సిబ్బందికి వినతిపత్రాన్ని అందించారు.

నిజానికి పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి మరియు కొంతమంది స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన కొన్ని ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే.అయితే ఇది కేవలం పర్సనల్ టూర్ వరకు అయి ఉంటే బాగుండేది.

కాకపోతే, పుష్ప టీం కూడా ఇందులో పాలుపంచుకోవడం.అలాగే ఈ సినిమా కోసం కొన్ని షూటింగ్ స్పాట్స్ ను వెతుకుతున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఆదిలాబాద్ టూర్ తర్వాత ఆయన మహారాష్ట్ర కూడా వెళ్లారు.ఈ టూర్ లో బన్నీ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ట్రావెల్ చేస్తున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు