మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఒక దొంగ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బొంత మెత్త కింద దాక్కున్నాడు.కానీ పోలీసులు అతన్ని పట్టుకొని షాక్ ఇచ్చారు.
తాజాగా ఇండోర్‌లోని ఛత్రిపుర పోలీసులు నేరస్థులలో చట్టం పట్ల భయాన్ని నెలకొల్పడానికి, నేరాలను అరికట్టడానికి ఒక డ్రైవ్ ప్రారంభించారు.దీనిలో భాగంగా ఒక నేరస్థుడు బొంత మెత్త కింద దాక్కుని అరెస్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
కానీ పోలీసులు చాకచక్యంగా అతడిని పసిగట్టి అరెస్టు చేశారు.వారు ఈ దాక్కున్న దొంగని అరెస్టు చేస్తుండగా ఒక ఫొటో కూడా తీశారు.
అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దాన్ని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
సీపీ హరినారాయణచారి మిశ్రా ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ పవన్ సింఘాల్ నేతృత్వంలోని టీమ్ శనివారం నాడు గాలింపు చర్యలు చేపట్టింది.ఈ డ్రైవ్‌లో, పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజర్ మొహల్లా, లాబరియా భేరు, ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లతో సహా 22 మంది యువకులను పోలీసులు పట్టుకున్నారు.
క్రిమినల్ హిస్టరీ ఉన్న రౌడీ షీటర్లు ఇప్పటికీ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై ఇంకా ఫిర్యాదులు అందుతున్నందున వారిపై చర్యలు తీసుకున్నట్లు ఒక పోలీస్ అధికారి పేర్కొన్నారు.

కాగా పోలీసులు ఒక హిస్టరీ షీటర్ ఇంటికి వెళ్లినప్పుడు , అతను మెత్తని బొంత కింద దాక్కోవడానికి ప్రయత్నించాడు.దానికి తోడు అతని కుటుంబ సభ్యులు కూడా పోలీసు అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.అయితే పోలీసులు మోసపోకుండా బొంతను తొలగించి పట్టుకున్నారు.