రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( BRS MLA Lasya Nanditha ) అంతిమయాత్రకి పార్టీ నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం లాస్య నందిత భౌతికకాయాన్ని కార్ఖానాలోని నివాసానికి తరలించారు.
ఆ తర్వాత ఈస్ట్ మారేడుపల్లి లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ క్రమంలో అంతిమయాత్రలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ తో( KCR ) పాటు చాలామంది బీఆర్ఎస్ నాయకులు… సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఇతర పార్టీలకు చెందిన వాళ్లు నివాళులర్పించారు.
కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు( Patancheru Police ) కీలక విషయాలు వెల్లడించారు.’నిన్న లాస్య నందిత సదాశివపేటకు వెళ్లి వచ్చారు.శుక్రవారం ఉదయం అల్పాహారం కోసం బయటకు వెళ్లారు.శామీర్ పేట వద్ద లాస్య నందిత కారు ఓఆర్ఆర్ పైకి ఎక్కింది.సుల్తాన్ పూర్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ ను కారు ఢీకొట్టింది.ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి కారు రెయిలింగ్ నీ ఢీకొంది’ అని వెల్లడించారు.
ఇదిలాఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఆమె సోదరి నివేదిత( Niveditha ) ఫిర్యాదుతో చర్యలకు దిగారు.ప్రమాద సమయంలో కారు నడుపుతున్న ఆకాశ్ పై( Akash ) ఐపీసీ 304 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.ఉదయం 5.15 గంటలకు ఆకాశ్ కాల్ చేసినట్లు నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయని చెప్పాడని.
వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జెనట్లు లాస్య సోదరి వెల్లడించారు.